కర్ణాటక రిజల్ట్స్: అభివృద్దే బిజెపిని గెలిపించింది: నిర్మలా సీతారామన్
బెంగుళూరు: అభివృద్దే తారకమంత్రంగా ప్రధానమంత్రి మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రచారంతో కర్ణాటకలో బిజెపి విజయానికి దోహదపడిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. బిజెపి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కర్ణాటక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విభజన రాజకీయాలను కన్నడ ఓటర్లు తిరస్కరించారని నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. ఇవాళ చరిత్ర సృష్టించిన దినంగా ఆమె అభివర్ణించారు.అభివృద్దికి ప్రజలు పట్టం కట్టినట్టు చెప్పారు. కర్ణాటకలో గెలుపు బిజెపికి మరువలేని దినమని ఆమె అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ఎన్ని మాయమాటలు చెప్పినా, నెగిటివ్ ప్రచారం చేసినా ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. అభివృద్ధి ప్రాతిపదికగా ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, కర్ణాటకను అభివృద్ధి బాట పట్టిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు.ప్రజలు మోడీ చూపిన అభివృద్ది బాట నడుస్తున్నారనేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications