కర్నాటకలో గెలుపు దిశగా బీజేపీ: కాంగ్రెస్‌కు ఓట్లు ఎక్కువ పడినా ఓటమి
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం దిశగా దూసుకెళ్తోంది. 224 నియోజకవర్గాలకు గాను 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మేజిక్ ఫిగర్ నూటా పన్నెండు కాగా 114 స్థానాల్లో కమలం పార్టీ ఆధిక్యంలో ఉంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 64 నియోజకవర్గాల్లో, జనతా దళ్ ఎస్ (జేడీఎస్) 40 స్థానాల్లో, బహుజన సమాజ్ పార్టీ 1 స్థానంలో, కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

ఓట్ల శాతం చూస్తే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి దగ్గరగా ఉంది. కొంత కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉంది. మధ్యాహ్నం వరకు చూస్తే కాంగ్రెస్ పార్టీకి 37.9 శాతం, బీజేపీకి 37.1 శాతం, జేడీఎస్‌కు 17.4 శాతం ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం బీజేపీ కంటే కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ సీట్లలో మాత్రం కమలం పార్టీకి ఎక్కువగా ఉంది. నోటాకు 0.9 శాతం ఓట్లు పడ్డాయి. బీఎస్పీకి 0.5 శాతం ఓట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications