• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో మెడికల్ విద్యార్థులపై రైట్ వింగ్ యాక్టివిస్టుల దాడి... అరెస్ట్ చేసిన పోలీసులు...

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో కొంతమంది భజరంగ్ దళ్ యాక్టివిస్టులు ఓ మెడికల్ స్టూడెంట్ బృందంపై దాడికి పాల్పడ్డారు. అంతా కలిసి సరదాగా పిక్నిక్‌కి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఆ యాక్టివిస్టులు వారి కారును అడ్డగించారు.అందరి పేర్లు అడిగి తెలుసుకున్నారు. ముస్లిం యువకులతో ఎందుకు తిరుగుతున్నారంటూ యువతులను ప్రశ్నించారు.ఆపై...ఆ బృందంపై దాడికి పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం... మంగళూరుకు చెందిన ఆరుగురు వైద్య విద్యార్థులంతా కలిసి ఆదివారం(సెప్టెంబర్ 25) సరదాగా మాల్పే బీచ్‌కి వెళ్లారు. అక్కడినుంచి తిరిగొస్తున్న క్రమంలో సురత్కల్ చెక్ పోస్టు వద్ద ఐదుగురు భజరంగ్ దళ్ యాక్టివిస్టులు వారి కారును అడ్డగించారు. కారులో ఉన్న వైద్య విద్యార్థుల పేర్లు అడిగి తెలుసుకున్నారు. ముస్లిం యువకులతో ఎందుకు వెళ్తున్నారంటూ అందులోని యువతులను ప్రశ్నించారు.

karnataka right wing activists arrested after they attacks a group of medical studentskarnataka right wing activists arrested after they attacks a group of medical students

ఆపై ఆ వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. షరిఫ్ అనే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంటనే స్పాట్‌కి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం ఆ విద్యార్థుల ఫిర్యాదు మేరకు మంగళూరు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. తామంతా పిక్నిక్‌కి వెళ్లి తిరిగొస్తుండగా తమ పేర్లు అడిగి దాడికి పాల్పడ్డారని వైద్య విద్యార్థులు వెల్లడించారు. మరోవైపు నిందితులు మాత్రం... కారులో ఉన్న యువతులను,వారితో ఉన్న యువకులు వేధిస్తుండటం తాము గమనించామని చెప్పారు. అయితే పోలీసుల విచారణలో అలాంటిదేమీ లేదని వెల్లడైంది.దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

కొద్దిరోజుల క్రితం బెంగళూరులోనూ...

కొద్దిరోజుల క్రితమే ఇదే తరహా ఘటన బెంగళూరులోనూ చోటు చేసుకుంది.ఓ ముస్లిం మహిళతో పాటు ఆమె కొలీగ్‌పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.ఇద్దరు కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తులు అడ్డగించారు. ఒక ముస్లిం మహిళవి అయి ఉండి... మరో కమ్యూనిటీకి చెందిన వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తావా... సిగ్గనిపించడం లేదా అంటూ ఆమెపై మండిపడ్డారు. తమ కమ్యూనిటీకి చెందిన మహిళను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లడానికి ఎంత ధైర్యమంటూ ఆమె కొలీగ్‌ను ప్రశ్నించారు. వారు చెబుతున్నది వినిపించుకోకుండా ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. బెంగళూరులోని డైరీ సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది.వీడియోలో ఆ వ్యక్తుల మాటలను గమనిస్తే... 'నీ పేరేంటి... సిగ్గనిపించడం లేదా... మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో నీకు తెలియదా... ఇలా కుక్కల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు... నీలాంటి వాళ్లే మన కమ్యూనిటీ పరువు తీస్తున్నారు.' అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. తనకు పెళ్లయిందని... కొలీగ్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్న విషయం తన భర్తకు తెలుసునని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. ఆమె భర్త ఫోన్ నంబర్ చెప్పాల్సిందిగా బెదిరించారు. ఆమె అతని ఫోన్ నంబర్ చెప్పడంతో వెంటనే అతనికి ఫోన్ చేసి తిట్ల దండకం అందుకున్నారు.
'ఓ నాన్ ముస్లిం వ్యక్తితో కలిసి వెళ్లేందుకు నీ భార్యను ఎందుకు అనుమతించావు.' అంటూ అతనిపై దుర్భాషలాడారు.

చివరకు,ఆమెను బలవంతంగా బైక్‌ పైనుంచి కిందకు దింపి... ఆటోలో ఇంటికి వెళ్లాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది.దీంతో ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఘటన జరిగిన 12 గంటల్లోనే వారిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఘటనపై స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని... ఉక్కు హస్తంతో అణచివేస్తామని అన్నారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని... వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు.

English summary
In Karnataka, some right wing activists attacked a group of medical students. The activists intercepted their car as they were returning from a picnic. The young women were asked why they were going out with Muslim men. And then ... they attacked the group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X