ఈశ్వరప్ప, ఎంతపని చేశావప్పా, కనిమోళి vs అన్నామలై, పాట తెచ్చిన తంటాలతో !
బెంగళూరు/చెన్నై: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప ఎక్కడుంటే అక్కడ హాట్ టాపిక్ అవుతోంది. శివమొగ్గలో బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్బంగా తమిళ రాష్ట్ర గీతం పెట్టారు. మధ్యలో ఆ పాటను నిలిపేసిన కేఎస్. ఈశ్వరప్ప తమిళనాడు నాయకుల మధ్య చిచ్చపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
శివమొగ్గలో గురువారం బీజేపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై హాజరైనారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత ఈశ్వరప్ప అని భావించిన అన్నామలై ఈశ్వరప్పకు పాదాబివందనం చేసి మరీ స్టేజ్ ఎక్కి బీజేపీ నాయకుల పక్కన కుర్చున్నారు.

అన్నామలై ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్బంగా అక్కడి బీజేపీ నాయకులు లౌడ్ స్పీకర్లలో తమిళనాడు రాష్ట్ర గీతం పెట్టారు. పాట మధ్యలో ఉండగానే నేరుగా స్టేజ్ మీద నుంచి లేచి వెళ్లిన ఈశ్వరప్ప తమిళనాడు రాష్ట్ర గీతం మధ్యలోనే నిలిపివెయ్యాలని చెప్పి కర్ణాటక రాష్ట గీతం పెట్టించారు. పార్టీ సీనియర్ నాయకుడు కావడంతో కేఎస్. ఈశ్వరప్పకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు.
ఇప్పుడు ఇదే విషయం బీజేపీ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. కర్ణాటలో తమిళనాడు రాష్ట గీతం మధ్యలో నిలిపివేసి తమిళనాడు ప్రజలను అవమానించారని. ఆ సందర్బంలో స్టేజ్ మీద ఉన్న అన్నామలై నిమ్మకునిరెత్తినట్లు ఉన్నారని, ఆయన తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కరుణానిధి కుమార్తె కనిమోళి డిమాండ్ చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే, స్టాలిన్ సోదరి అయిన కనిమోళి అన్నామలై తీరును తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్నామలై సహమక్షంలోనే తమిళనాడు రాష్ట్ర గీతానికి అవమానం జరిగిందని, తమిళనాడు రాష్ట్ర గీతం స్టేజ్ మీద పెట్టించలేని ధైర్యంలేని వ్యక్తి తమిళనాడు ప్రజలకు ఏం సేవ చేస్తారని కనిమోళి ప్రశ్నించారు.

కనిమోళి ఆరోపణలకు అన్నామలై కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎంకే స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర జెండాను ఎగరవేశారని, ఆ సందర్బంలో తమిళనాడు రాష్ట్ర గీతం పెట్టకుండా అప్పుడే తమిళ ప్రజలనున స్టాలిన్ అవమానించారని పాత టీవీ న్యూచానల్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేసిన అన్నామలై డీఎంకే పార్టీకి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు ప్రజల గురించి పట్టించుకోకుండా గొప్పలు చెప్పుకుంటున్న డీఎంకే పార్టీ నాయకులు తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నామలై మండిపడ్డారు. మొదట మీరు ఆ రోజు తమిళ రాష్ట్ర గీతం ఎందుకు పెట్టలేదు అని సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు. మొత్తం మీద స్టేజ్ మీద తమిళ రాష్ట్ర గీతం మధ్యలో నిలిపివేసిన కేఎస్. ఈశ్వరప్ప ఇప్పుడు తమిళనాడులో డీఎంకే, బీజేపీ నాయకుల మధ్య చిచ్చురేపారు.
-
విజయ్ వైపే యూత్, డీఎంకే కు షాక్.. తేల్చేసిన సర్వే -
రుణమాఫీ నిధులు విడుదల, వడ్డీ రాయితీపై కీలక ఉత్తర్వులు. -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్











Click it and Unblock the Notifications