మా చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వండి, స్వామీజీ సంచలన వ్యాఖ్యలు, స్వామి చెప్పినట్లు జరిగింది !
మన సమాజంలోని నాయకులు, మఠాధిపతుల చేతుల్లోకి ఆయుధాలు ఇవ్వాలని స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ స్వామీజీ దింగాళేశ్వర స్వామీజీ మాట్లాడుతూ ఆయుధాలు ఇచ్చి సన్యాసులు, మఠాధిపతులకు రక్షణ కల్పించాలన్న పురాణాల మాటలను ఉటంకిస్తూ స్వామీజీల చేతుల్లోకి ఆయుధాలను అందించాలన్నారు. స్వామీజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
కర్ణాటకలోని హుబ్బళిలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పుట్టిన రోజు వేడుకల కార్యక్రమంలో దింగాళేశ్వర స్వామీజీ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. స్వామీజీ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాళికాదేవి చేతికి ఆయుధం ఇచ్చినందున ఆమె దుష్టులను చంపిందని, వారికి సరైన శిక్ష విధించిందని, కాళికాదేవి చేతిలో రాక్షసులు అంతం అయ్యారని పురాణాలు చెబుతున్నాయని దింగాళేశ్వర స్వామీజీ గుర్తు చేశారు.

ఇలా చెప్పడానికి కారణం మన నాయకులు ఒక్కొక్కరికి ఆయుధాలు అందించాలని, సమాజంలో బలంగా తయారయ్యే వ్యక్తులను కలవరపరిచే పని ఈ దేశంలో ఉందని, అందుకే మా సమాజానికి, మఠాధిపతులకు, నాయకుల చేతికి ఆయుధాలు ఇవ్వడం తప్పు కాదని స్వామీజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే కులపెద్దల బలోపేతానికి సహరించినట్లు అవుతుందని స్వామీజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మన కులం నేతలను రాజకీయంగా నాశనం చేసే వ్యవస్థ తయారైయ్యిందని, పుట్టిన రోజు వేడుకల్లో ఇలా మాట్లాడ వచ్చో లేదో తనకు తెలీదని, తాను చెప్పాలనుకున్నా, ఇప్పుడు చెబుతున్నానని దింగాళేశ్వర స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో చేస్తున్న దిగజారుడుతనాన్ని మనం సహించకూడదని, రాజకీయ నాయకులు సమాజానికి మూలస్తంభాలు అని, ప్రతి ఒక్కరూ మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, లింగాయత్ నాయకులు బలంగా ఉండాలని దింగాళేశ్వర స్వామీజీ అన్నారు.
కర్ణాటకలో బీజేపీ నాశనం అవుతుందని ఆ పార్టీకి వ్యతిరేకంగా ముందే జోస్యం చెప్పిన శ్రీ దింగాళేశ్వర స్వామిజీ చెప్పిన మాటలు అక్షరాల నిజయం అయ్యింది. 2021లో మాట్లాడిన దింగాళేశ్వర స్వామాజీ కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందని అప్పట్లోనే జోస్యం చెప్పారు. మాజీ సీఎం ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను బలవంతంగా సీఎం కుర్చీ నుంచి కిందకు దించేశారని బీజేపీ నాయకులను అప్పట్లో నిలదీయడంతో దింగాళేశ్వర స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోజే బీజేపీ గురించి దింగాళేశ్వర స్వామీజీ జోస్యం చెపి బీజేపీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలో బీజేపీ పట్టు సాధించడానికి కారణమైన యడ్యూరప్పను నిర్లక్షం చేశారు, రానున్న రోజుల్లో బీఎస్ యడియూరప్ప కన్నీళ్లలో బీజేపీ కొట్టుకుపోతుందని, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని దింగాళేశ్వర స్వామీజీ జోస్యం చెప్పారు స్వామీజీ చెప్పినట్లు ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందు బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
తరువాత కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆరాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రతిపక్ష నేత, రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హులైన అభ్యర్థిని నియమించడంలో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు నాయకులు, అర్చకులు, మఠాధిపతుల చేతికి ఆయుధాలు ఇవ్వాలని దింగాళేశ్వర స్వామీజీ బహిరంగంగా చెప్పడం కర్ణాటకలో చర్చనీయాంశమైంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications