Ola,Uber: ఐటీ హబ్ లో ఉబర్, ఓలా, ర్యాపిడో సర్వీసులు బంద్, రూ. 30కి బదులుగా ఇంత డబ్బులా ? !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేయాలని కర్ణాటక రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు నడిపితే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ హెచ్చరించారు. ఓలా, ర్యాపిడో, ఉబర్ పంచాయితీ తారాస్థాయికి చేరడంతో ఆ సంస్థల ప్రతినిధులు బిత్తరపోయారు. ఓలా, ఉబర్, ర్యాపిడో య్యాప్ తో క్యాబ్ లు, ఆటోలు నడుపుతూ సామాన్య ప్రజల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారని, ఈ కారణంగా సామాన్య ప్రజలు, డ్రైవర్లు కూడా నష్టపోతున్నారని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. రవాణా శాఖ అధికారులు క్యాబ్ లు, ఆటోలు సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వ రవాణా శాఖ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని కర్ణాటక రవాణా శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఉబర్, ఓలా, ర్యాపిడో సర్వీసులు బంద్
ఈనెల 12వ తేదీ (బుధవారం( నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు నడిపితే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ హెచ్చరించారు. ఓలా, ర్యాపిడో, ఉబర్ పంచాయితీ తారాస్థాయికి చేరడంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆ సంస్థల యాజమాన్యం హడలిపోయింది.

రూ. 30కి బదులుగా రూ. 70, రూ. 100 ?
ఐటీ హబ్ బెంగళూరుతో సహ కర్ణాటకలో ఆటో డ్రైవర్లు రెండు కిలోమీటర్ల వరకు మినిమమ్ చార్జ్ రూ. 30 వసూలు చెయ్యాల్సి ఉంది. ఈ నియమనిబంధనలు కర్ణాటక ప్రభుత్వ రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ లు ఉన్న ఆటో డ్రైవర్లు రూ. 70 నుంచి రూ. 100 వరకు మినిమమ్ చార్జీ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారని సంబంధిత రవాణా శాఖ అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదులు చెయ్యడంతో వివాదం మొదలైయ్యింది.

బలుపు ఎక్కువ అయ్యిందా ?
మినిమమ్ చార్జ్ రూ. 30 కంటే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చెయ్యకూడదని నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా బెంగళూరులో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు అధిక మొత్తంలో ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ సంస్థల య్యాప్ లతో వాహనాలు నడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులు డిసైడ్ అయ్యారు.

ఒక్కో వాహనంకు రూ. 5 వేలు ఫైన్
ఉబర్, ఓలా, ర్యాపిడో య్యాప్ లతో ఆటోలు, క్యాబ్ లు నడిపితే ఒక్కో వాహనానికి రూ. 5,000 అపరాద రుసుం వసూలు చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. బుధవారం నుంచి ఉబర్, ఓలా, ర్యాపిడో య్యాప్ లతో ఆటోలు, క్యాబ్ లు నడిపేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రయాణికులు, డ్రైవర్లకు నష్టమే
బెంగళూరు నగరంలో ఓలా, ఉబర్, ర్యాపిడో య్యాప్ తో క్యాబ్ లు, ఆటోలు నడుపుతూ సామాన్య ప్రజల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారని, ఈ కారణంగా సామాన్య ప్రజలు, డ్రైవర్లు కూడా నష్టపోతున్నారని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.

చర్చలు విఫలం
మంగళవారం ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలతో కర్ణాటక రవాణా శాఖా ప్రధాన కార్యదర్శి కుమార్, సంబంధిత అధికారులు చర్చలు జరిపారు. చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి ఉబర్, ఓలా, ర్యాపిడో సర్వీసులు నిలిపివేయాలని రవాణా శాఖ అధికారులు డిసైడ్ అయ్యారు.

కంపెనీల నిలువు దోపిడి ?
ఈ దెబ్బతో కర్ణాటక రవాణా శాఖ అధికారులు క్యాబ్ లు, ఆటోలు సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వ రవాణా శాఖ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని కర్ణాటక రవాణా శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications