బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారంపాటు భారీ వర్షాలు: బెంగళూరుకు వరద సూచనలు, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

బెంగళూరుకు వరద సూచనలు జారీ చేసిన డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్

బెంగళూరు: రానున్న 24 గంటల్లో బెంగళూరుకు వరద సూచనలు ఉన్నాయని కర్ణాటక రాష్ట్ర నేచరల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలోని ఎనిమిది జోన్లలోని ఐదు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు ఉందని పేర్కొంది.

రాజరాజేశ్వర నగర్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, మహదేవపుర జోన్, బొమ్మనహల్లి జోన్‌లలోని వరదకు గురయ్యే అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా శనివారం బెంగళూరుకు చెందిన ఓ 25 ఏళ్ల లేబర్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ముగ్గురు గాయపడ్డారు. వర్షం కారణంగా ఐటీఐ లేఅవుట్లోని వారి ఇంటి గోడ కూలిపోయింది.

Karnataka weather agency issues flood alert for Bengaluru for the next 24 hours

జూన్ 3వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరక్ ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని మానిటరింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 26 జిల్లాల్లో వర్షపాతం నమోదయింది. వర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కుమారస్వామి రూ.5 లక్షలు ప్రకటించారు.

English summary
The Karnataka State Natural Disaster Monitoring Centre on Sunday issued a flood forecast for Bengaluru for the next 24 hours, The Times of India reported. Low-lying ow lying localities in five of the eight zones in the city are vulnerable to flooding, the agency said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X