హీరో కమల్ హాసన్, డీఐజీ రూపా భేటీ, సోషల్ మీడియాలో ఫోటో, ఇంత చర్చ వద్దు !

బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్, కర్ణాటక సిన్సియర్ ఐపీఎస్ అధికారిని డీఐజీ రూపా తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

బెంగళూరు: బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్, కర్ణాటక సిన్సియర్ ఐపీఎస్ అధికారిని డీఐజీ రూపా తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కమల్ హాసన్ తో మీరు ఫోటో ఎందుకు తీసుకున్నారు మేడమ్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

మరికొందరు డీఐజీ రూపాను అభినందిస్తున్నారు. కమల్ హాసన్ ఫోటోపై వచ్చిన వ్యతిరేకతపై డీఐజీ రూపా స్పంధించారు. మనిషి సంఘజీవి, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని గుర్తు చేశారు. కమల్ హాసన్ తో తాను దిగిన ఫోటో గురించి సోషల్ మీడియాలో అనవసరంగా చర్చలు పెట్టరాదని డీఐజీ రూపా సూచించారు.

Karnataka woman IPS officer DIG Roopa meets actor Kamal Haasan

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాలను రెండు నెలల క్రితం డీఐజీ రూపా వెలుగులోకి తీసుకు వచ్చారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా జైళ్ల శాఖ అధికారులు ఆమె కుటుంబ సభ్యుల దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైళ్ల శాఖ అవినీతి గురించి బహిరంగంగా ఆరోపణలు చేసిన డీఐజీ రూపాను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. ఆ సందర్బంలో డీఐజీ రూపా దేశవ్యాప్తంగా చర్చకు కారణం అయ్యారు. నిజాయితీగా పని చేసే ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వాలు ఇచ్చే బహుమతి ఇదే మేడమ్ అంటూ డీఐజీ రూపకు అనేక మంది మద్దతుగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+