జయలలిత ఆరోగ్యంపై వదంతులు, ఫోటో విడుదల చేయండి: కరుణ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం పైన రాష్ట్రంలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఆమె ఆరోగ్యం పైన పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. జయలలిత అనారోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గతంలో చెప్పినట్లుగా జయలలిత సిద్ధాంతాలతో తాను విభేదిస్తున్నానని, అయితే అనారోగ్యం బారిన పడిన ఆమె త్వరగా కోలుకొని అధికార విధులకు హాజరు కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. జయలలిత అనారోగ్యంపై కొంతమంది అవాంఛిత వదంతులు ప్రచారం చేస్తున్నందున అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్లు విడుదల చేయాలన్నారు.
సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. అధికారిక ప్రకటన చేసి వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఆసుపత్రిలో ఉన్న జయలలిత ఫోటోలు మీడియికాు విడుదల చేసి వదంతులు వ్యాప్తి చేయకుండా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications