కరుణానిధి ఆరోగ్యం వెరీ క్రిటికల్: ఆసుపత్రికి అభిమానులు, నేతల తాకిడి
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉందని కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం వెల్లడించారు. దీంతో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద ఎవరు కనిపిస్తే వారితో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కరుణానిధి ఫొటోలను పట్టుకొని ఆయన కోసం కంటతడి పెడుతున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతుండటంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రికి భారీగా కార్యకర్తలు తరలి వస్తుండటంతో భద్రతను పెంచారు. దాదాపు 600 మంది పోలీసులు ఆసుపత్రి వద్ద 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి మంగళవారం కావేరి ఆసుపత్రికి వచ్చి కరుణానిధిని చూశారు. కరుణ తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కూతురు కనిమొళితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Supporters gather outside Chennai's Kauvery Hospital where DMK President M. Karunanidhi is undergoing treatment. The hospital had yesterday stated a decline in his medical condition. #TamilNadu pic.twitter.com/ajMbZ01poQ
— ANI (@ANI) August 7, 2018
Recommended Video

ఆసుపత్రి బయట వేచి ఉన్న అభిమానులను కనిమొళి కలుసుకున్నారు. కరుణానిధి త్వరగానే కోలుకుంటారని, ఆయన కోసం ప్రార్థించాలన్నారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా ఆసుపత్రికి వచ్చారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ట్వీట్ చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని తీవ్ర కలత చెందానని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Chennai: DMK supporters continue to gather outside Kauvery Hospital where DMK Chief M Karunanidhi is currently admitted. #TamilNadu pic.twitter.com/1BKq6zo9vH
— ANI (@ANI) August 7, 2018
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications