మెరీనా వద్ద ఆర్మీ: ఎందుకో చెప్పాలని సీఎంకు స్టాలిన్ ప్రశ్న, అభిమానులపై లాఠీఛార్జ్, ఇద్దరు మృతి
Recommended Video

చెన్నై: కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌కు నాయకులు, వీఐపీలు, అభిమానులు తరలి వస్తున్నారు. కలైంజ్ఞర్‌ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున రాజాజీ హాల్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కరుణానిధిని చివరిసారిగా చూసేందుకు ప్రజలు రాజాజీ హాల్ లోపలికి చొచ్చుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. చొచ్చుకు వస్తున్న రద్దీని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు. రాజాజీ హాల్ సమీపంలో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించి వచ్చే ప్రయత్నం చేశారు. కొందరు గోడలు ఎక్కారు. లాఠీఛార్జ్ సందర్భంగా దాదాపు నలభై మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందారు. కొందరిని ఆసుపత్రికి తరలించారు. రాజాజీ హాలుకు వెళ్లే మార్గాన్ని మూసేశారు.

మరోవైపు, మెరీనా బీచ్ వద్ద కేంద్రం ఆర్మీని దింపింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చింది. సైనిక వాహనాలు క్రమంగా చేరుకుంటున్నాయి. అన్నాదురై సమాధి వద్ద డీఎంకే కార్యకర్తలు తలనీలాలు సమర్పించారు.
ముఖ్యమంత్రి పళని స్వామి నిర్ణయం అందరినీ
అధికారంలో ఉన్న వారు ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అన్నారు. అంతిమయాత్ర సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయం అందరినీ నిరాశపరిచిందన్నారు. డీఎంకే కార్యకర్తలకు ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
అందరూ ప్రశాంతంగా ఉండాలని, తన కోసం కాదని, కరుణానిధికి నివాళిగా ఉండాలని కోరారు. అభిమానులు సంయమనం పాటించాలన్నారు. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలపై హైకోర్టు తీర్పు ప్రజా విజయం అన్నారు. ప్రభుత్వం వివాదం సృష్టించాలని ప్రయత్నించిందన్నారు. భద్రత ఎందుకు తొలగించారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications