అమ్మ కోసం అపోలోకు కరుణానిధి భార్య..
చెన్నై : గత నెల 27నుంచి ఆసుపత్రికే పరిమితమైపోయిన అమ్మ ఆరోగ్యంపై పలువురు ప్రముఖ నేతలు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాహుల్ గాంధీ, అమిత్ షా లాంటి నేతలు స్వయంగా అపోలో ఆసుపత్రి వద్దకు వెళ్లి మరీ పరామర్శించారు. తాజాగా డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ అపోలో ఆసుపత్రిని సందర్శించారు.

గురువారం రాత్రి కుమార్తె కనిమొళితో కలిసి అపోలో ఆస్పత్రిని సందర్శించిన రాజాత్తి అమ్మాళ్.. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమ్మ యోగక్షేమాలను దగ్గరుండి పరిశీలిస్తున్న శశికళను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, గతవారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్ నేతలు ఎస్.దురైమురుగన్, కె.పొన్ముడి అపోలోను సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోన్న జయలలిత కల్లు తెరిచారని వైద్యులు ధ్రువీకరించినట్లుగా వార్తలు రావడంతో.. అమ్మ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అమ్మ కోసం చేస్తోన్న పూజలు ఫలిస్తున్నాయని, అమ్మ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అవుతారని వారంతా ఆకాంక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications