ఎన్‌కౌంటర్: ఇద్దరు జవాన్లు మృతి, నలుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాదులున్నారనే ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు పుల్వామా జిల్లాలోని లామ్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య పరస్పరం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక పోలీసు, ఒక జవాను తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి చేర్చారు.
చికిత్స పొందుతూ వీరిద్దరు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications