కశ్మీర్-వైష్ణోదేవీ యాత్రలకు గౌరవ్ భారత్ రైళ్లు-స్టాప్ లు, బుకింగ్స్, ప్యాకేజీ ఇలా..!
ఈ సీజన్ లో హిమాలయాల సానువుల్లోని వైష్ణోదేవి ఆలయంతో పాటు కాశ్మీర్ కు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం గౌరవ్ భారత్ (Gaurav Bharat) ప్రత్యేక రైలును ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి స్టాప్ లు ఇచ్చారు. అలాగే ప్రత్యేక రైలు కావడంతో దీనికి ఐఆర్సీటీసీలో టికెట్ల బుకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్టాప్ లు ఏంటి?, బుకింగ్స్ ఎలా, ఇతర వివరాలను ఓసారి చూసేద్దాం..
కశ్మీర్, వైష్ణోదేవి యాత్రలకు గౌరవ్ భారత్ రైళ్లు (gaurav bharat)
ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి 23 వరకూ మొత్తం 13 రోజుల పాటు ఈ యాత్రకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడులోని మదురైలో బయలుదేరే గౌరవ్ భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా కాశ్మీర్ కు వెళ్తుంది. గౌరవ్ భారత్ రైలు-టూరిజం శాఖ ఆమోదించిన ఆపరేటర్ టూర్ టైమ్స్ సహకారంతో ఈ యాత్రను చేపడుతోంది. ఈ ప్రత్యేక రైలుకు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీలో అవకాశం లేదు. కాబట్టి ప్రయాణికులు 93550 21516 నంబర్ కు కాల్ చేసి అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆన్ లైన్లో www.tourtimes.in వెబ్ సైట్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

13 రోజుల యాత్ర ప్యాకేజీలివే
కాశ్మీర్ యాత్రకు బుక్ చేసుకునే ట్రైన్ లో ఆగ్రా, ఢిల్లీ, అమృత్ సర్, శ్రీనగర్, గుల్ మార్క్, సోనే మార్గ్ ను కవర్ చేస్తారు. ఈ రైలు 13 రోజుల యాత్రకు ఒక్కొక్కరికీ సెకండ్ స్లీపర్ కు రూ.42400, ధర్డ్ ఏసీకి 54 వేలు, సెకండ్ ఏసీకి61 వేలు, ఫస్ట్ ఏసీకి 68,200 టికెట్ ధరలు నిర్ణయించారు. అలాగే వైష్ణోదేవి యాత్రకు బుక్ చేసుకునే రైలులో ఆగ్రా, మథుర, హరిద్వార్, రుషికేష్, కురుక్షేత్ర, వైష్ణోదేవి, అమృత్ సర్, ఢిల్లీ కవర్ చేస్తారు. ఈ రైలులో 13 రోజుల యాత్రకు ఒక్కొక్కరికీ సెకండ్ స్లీపర్ కు రూ.36800, ధర్డ్ ఏసీకి రూ.58,440, సెకండ్ ఏసీకి రూ.54,300 వేలు, ఫస్ట్ ఏసీకి 65,700 టికెట్ ధరలు నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాల్లో స్టాప్ లు
తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రైళ్లకూ రాయలసీమలోని పెనుకొండ, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, కర్నూలు, తెలంగాణలో గద్వాల్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లో స్టాప్ లు ఇచ్చారు. విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారి కోసం టూర్ ఆపరేటర్ సికింద్రాబాద్ వరకూ ట్రాన్స్ పోర్ట్ సదుపాయం కల్పిస్తారు. దీనికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ రైలులో పబ్లిక్ అనౌన్స్ మెంట్ ఎంటర్ టైన్మెంట్ సిస్టమ్స్, ఆన్ బోర్డ్ టూర్ మేనేజర్లు, సెక్యూరిటీ, దక్షిణభారత భోజనం లభిస్తాయి. ఇందులో 650 మంది ప్రయాణికులు ఎక్కవచ్చు. వసతి, సందర్శన, బస, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్టీసీ, ఎల్ఎఫ్సీ సౌకర్యాలు ఉంటాయి.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications