కథువా రేప్: బాధితురాలి పేరు, ఫొటో వాడినందుకు ఒక్కో మీడియాకు రూ. 10లక్షల జరిమానా
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక పేరు, ఫొటో, ఇతర వివరాలను పలు మీడియా సంస్థలు బయటపెట్టడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు మీడియా సంస్థలపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలి పరిహార నిధికి పంపించాలని కోర్టు ఆదేశించింది.
చట్ట ప్రకారం మీడియా సంస్థలు అత్యాచార బాధితురాలి పేరును వెల్లడించకూడదు. అయితే ఇటీవల జరిగిన కథువా ఘటనలో బాధితురాలైన మైనర్ బాలిక పేరు, ఫొటో వివరాలను పలు వార్తా పత్రికలు, వార్తా ఛానళ్లు ప్రముఖంగా వెల్లడించాయి. దీంతో కోర్టు తీవ్రంగా ఖండించింది. అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెడితే వారికి 6నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసంది.

ఈ ఏడాది జనవరిలో కథువాలోని రసానా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను దాదాపు వారం రోజుల పాటు బంధించి, మత్తు పదార్థాలిచ్చి, అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హత్య చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా అరెస్ట్ చేశారు. కాగా, ఈ రేప్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications