కత్రినా డెస్టినెషన్ వెడ్డింగ్: గెస్టులకు రూల్స్, మొబైల్స్ తీసుకురావద్దు.. ఎందుకంటే..
కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ డెస్టినెషన్ వెడ్డింగ్‌కు సర్వం సిద్దం అయ్యింది. కరోనా వల్ల తక్కువ మంది అతిథులతో పెళ్లి జరగనుంది. వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఉండగా.. ఈ నెల 9వతేదీన పెళ్లితో ఒకటి అవనుంది. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ బర్వారా కోట పెళ్లికి ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడి సిక్స్ సెన్సెస్ రిసార్ట్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి కోసం అందంగా ముస్తాబవుతోంది. ఇవాళ్టి నుంచి పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి.

నో మొబైల్
విక్కీ, కత్రినాల పెళ్లి పత్రికలో ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పెళ్లికి వచ్చే అతిథులు జైపూర్ విమానాశ్రయం నుంచి రణథంబోర్ వచ్చే క్రమంలో రోడ్డు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారట. .పెళ్లికి హాజరయ్యే సమయంలో తమ ఫోన్లను తమకు కేటాయించిన గదుల్లోనే వదిలి రావాలని సూచించారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, పెళ్లి సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించడం నిషేధించామని పెళ్లిబృందం తరఫున ఆ శుభలేఖలో స్పష్టం చేశారు.

అతిథులే వీరే
వీరి పెళ్లికి కరణ్ జొహార్, ఫరాఖాన్, అంగద్ బేడీ, నేహా ధుపియా, శ్వారి వాఘ్, కబీర్ ఖాన్, మినీ మాధుర్, అంగీరా థర్, నిత్యా మెహ్రా, కత్రినా వ్యక్తిగత వైద్య నిపుణుడు డాక్టర్ జ్యుయెల్ గమాడియా, కత్రినా ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా, కత్రినా స్టయిలిస్ట్ అమిత్ ఠాకూర్, డేనియల్ బాయెర్ పెళ్లికి కచ్చితంగా హాజరవుతారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, రోహిత్ శెట్టి, అలీ అబ్బాస్ జాఫర్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
Recommended Video

వెంకికీ ఆహ్వనం
ఇటు టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేశ్ హాజరవుతారు. వెంకీ మామకు పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది. వీరిద్దరూ కలిసి మల్లీశ్వరి మూవీలో నటించిన సంగతి తెలిసిందే. మిగతా నటులకు ఆహ్వనం గురించి ప్రస్తుతం తెలియరాలేదు. తెలుగులో మిగతా నటులతో కత్రినా కైఫ్ నటించారు. కానీ వారికి ఆహ్వానించిన విషయంపై సమాచారం లేదు. వెంకీకి మాత్రం.. ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications