వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతి

|
Google Oneindia TeluguNews

ముంబై: నవంబర్ 26, 2008లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాద నిరోధక బృందం చీఫ్ హేమంత్ కర్కరే భార్య కవితా కర్కరే మృతి చెందారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

హఠాత్తుగా కిందపడి కోమాలోకి వెళ్లిపోవడంతో కవితను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. కాగా, ఆమె తన మరణానికి ముందే తన దేహాన్ని పరిశోధన కోసం డొనేట్ చేశారు.

Kavita Karkare, Wife of Top Cop Killed in 26/11, Dies in Mumbai

ఉద్రవాదుల దాడిలో సరైన ఆయుధాలు లేని కారణంగానే తన భర్తతో పాటులు పలువురు పోలీసు ఉన్నతాధికారులు చనిపోయారని ఆమె గతంలో ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలను, సరైన శిక్షణను, వసతులను కల్పించాలని కవితా కర్కరే డిమాండ్ చేశారు.

2008, నవంబర్ 26న ముంబైలోని కామా ఆస్పత్రి వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో హేమంత్ కర్కరేతోపాటు అడిషనల్ పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలస్కర్ మృతి చెందారు.

English summary
Kavita Karkare, wife of former Maharashtra Anti-Terror Squad chief Hemant Karkare who died fighting terrorists during the 26/11 attacks in Mumbai, died today afternoon after she suffered a brain haemorrhage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X