
సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై ఎఫ్ఐఆర్ - సీఎంపైనా కేసు: తెలిసి తెలిసీ..అక్కడ ఎంజాయ్
గువాహటి: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురుు జగ్గీ వాసుదేవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాం గోలాఘాట్ జిల్లాలోని బొకాఖట్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు పెట్టారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపైనా ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు పోలీసులు. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారిద్దరిపైనా ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసినట్లు గోలాఘాట్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టినట్లు చెప్పారు.
రెండురోజుల
పాటు
తిరుమలలో
వైఎస్
జగన్
-
తొలిసారి
అక్కడికి..!!
ప్రభుత్వం విధించిన నియమ, నిబంధనలను స్వయానా ముఖ్యమంత్రే ఉల్లంఘించడం ఈ కేసులో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్‌లో నిబంధనలకు విరుద్ధంగా నైట్ సఫారీ చేసినందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు రోజుల చింతన్ శిబిర్‌ను ప్రారంభించడానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ గువాహటికి చేరుకున్నారు. అనంతరం రాత్రి మిహిముఖ్ నుంచి జీపులో సఫారీకి వెళ్లారు.

ఆ సమయంలో జగ్గీ వాసుదేవ్ వెంట ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పర్యాటక శాఖ మంత్రి జయంత మల్లా బారువ, కజిరంగా నేషనల్ పార్క్, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సెంట్రల్ రేంజ్‌లో నైట్ సఫారీ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే- సూర్యాస్తమయం తర్వాత సఫారీని పార్క్ లోపలికి అనుమతించరు. వన్యప్రాణులకు హాని కలుగుతుందనే ఉద్దేశంతో నైట్ సఫారీ చేయడానికి అనుమతి లేదు.
వాహనాల లైట్లు, శబ్దం వల్ల వన్యప్రాణులు ఒత్తిడికి గురవుతాయని, సహజ కాంతికి అలవాటు పడిన అడవి జంతువులకు ఇది హాని కలిస్తుందనే ఉద్దేశంతో నైట్ సఫారీని నిషేధించింది అస్సాం ప్రభుత్వం. ఈ నేషనల్ పార్క్‌లో జీప్, ఏనుగు సఫారీ అందుబాటులో ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వీటికి అనుమతి ఇస్తారు అధికారులు. సాయంత్రం 5 గంటల తరువాత సందర్శకులెవరినీ అనుమతించరు.
His blessings are special. His teachings, extraordinary.
— Himanta Biswa Sarma (@himantabiswa) September 24, 2022
Revered @SadhguruJV, in whose presence Kaziranga National Park opened today for tourists, has a special message to save precious Rhinos. And indeed he enjoyed the Jeep Safari.
Tourism Min Shri @jayanta_malla accompanied. pic.twitter.com/0donjtW9Vy
అధికారులు, సిబ్బందిని మినహాయించి ఎవరినీ పార్కులోకి అనుమతించరు. దీనికి భిన్నంగా జగ్గీ వాసుదేవ్, హిమంత బిశ్వ శర్మ, జయంత మల్లా బారువ వ్యవహరించడంతో వారందరిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన పట్ల వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం-1960లోని నిబంధనలను సద్గురు ఉల్లంఘించారని ఆరోపించారు.