వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవితకు కేంద్ర మంత్రి యత్నాల మాటేమిటి?.. సీఎం కేసీఆర్‌ను నిలదీసిన మమతా దీదీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, త్రుణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రెండు రోజుల క్రితం కోల్‌కతాలో సమావేశం అయ్యారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా ముందడుగు పడినట్లు వార్తలొచ్చాయి. ఇందుకోసం అన్ని రకాల ఆయనకు మద్దతునిస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారని ఆ వార్తల సారాంశం. కానీ వారిద్దరి మధ్య జరిగిన చర్చల్లో జరిగింది వేరని విశ్వసనీయ వర్గాల కథనం.
సీఎం కేసీఆర్ వద్ద మమతాబెనర్జీ వద్ద గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వినికిడి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం మద్దతు ఇవ్వడం సంగతి పక్కనబెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మమతాబెనర్జీ వద్ద అవమానం జరిగిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్‍తోపాటు చర్చల్లో పాల్గొన్న టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు ఈ సంగతి చెప్పారు.

 జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్రకు కేసీఆర్ రెడీ ఇలా

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్రకు కేసీఆర్ రెడీ ఇలా

దీని ప్రకారం సీఎం కేసీఆర్ కేవలం కోల్‌కతాలోని ప్రసిద్ధి చెందిన కాళీమాత దేవాలయాన్ని సందర్శించాలన్నదే అసలు ఉద్దేశమని సమాచారం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామని భారీగా ప్రచారం హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెతో భేటీ ఖరారు చేశారని సమాచారం. తెలంగాణ సీఎం కావడంతో కేసీఆర్‌, ఆయన సలహాదారులకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలికారని తెలుస్తోంది.

 కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ వివరణ

కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ వివరణ

మమతాబెనర్జీ, కేసీఆర్ పరస్పరం అభినందనలు పూర్తయ్యాక జాతీయ రాజకీయాల్లో ప్రవేశం, తన భాగస్వామ్యం గురించి సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను వివరించి.. నాలుగేళ్లుగా తెలంగాణలో తన ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టారని తెలుస్తోంది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ చెబుతున్న విషయాలను ఆసక్తిగా విన్నారని సమాచారం.

మమత కార్యదర్శి నివేదన

మమత కార్యదర్శి నివేదన

సీఎం కేసీఆర్ తో టీఆర్ఎస్ సభ్యుల నిరసనధ్రువీకరించుకున్న మమత కొద్ది సమయం తర్వాత మమతాబెనర్జీ కార్యదర్శి జోక్యం చేసుకుని.. లోక్‌సభలో పరిణామాలను నివేదించారు. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యుల నిరసన వల్లే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదని చెప్పారు. సభ ఆర్డర్‌లో లేదని అందువల్లే అవిశ్వాస తీర్మానం చేపట్టలేనని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారని ఆమె కార్యదర్శి చెప్పడంతో పరిస్థితి అంతా మారిపోయిందని వినికిడి. ఆ వెంటనే మమతా బెనర్జీ సీరియస్ అయ్యారని.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం అనుమతించకపోవడానికి టీఆర్ఎస్ ఎంపీల నిరసనే కారణమా? అని ధ్రువీకరించుకున్నారు.

 పలు అంశాలపై టీఆర్ఎస్ పార్టీకి కొరవడిన స్పష్టత

పలు అంశాలపై టీఆర్ఎస్ పార్టీకి కొరవడిన స్పష్టత

‘ఒకవైపు మీరు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడదామని చెబుతారు. మరోవైపు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేసి పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారు. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు? మీ ఎంపీలు ఆందోళన చేయకుండా నిలువరించాలని ఎందుకు చెప్పలేదు?' అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆమె ప్రశ్నించారని తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ వివరణ ఇస్తుండగానే మమతాబెనర్జీ మరోసారి జోక్యం చేసుకుని పలు అంశాలపై టీఆర్ఎస్ పార్టీకి స్పష్టత లేదని గుర్తు చేశారని సమాచారం.

 ఆధారాల్లేకుండా అనవసర వ్యాఖ్యలు చేయనని కవితకు రిటార్ట్

ఆధారాల్లేకుండా అనవసర వ్యాఖ్యలు చేయనని కవితకు రిటార్ట్

ఒక గవర్నర్ ద్వారా సీఎం కేసీఆర్ తన కూతురు కల్వకుంట్ల కవితకు కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి కోసం ప్రయత్నించిన సంగతి నిజం కాదా? అని.. ఈ లాబీయింగ్ ఇంకా కొనసాగుతున్న సంగతి వాస్తవం కాదా? అని మమతాబెనర్జీ నిలదీశారు. ఇదే సమావేశంలో ఉన్న ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చేరే ఆలోచనేమీ లేదని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారట. దీనిపైనా మమతాబెనర్జీ స్పందిస్తూ, తాను ఆధారాలు సేకరించకుండా అనవసర వ్యాఖ్యలు చేయనని హెచ్చరించారు.

 కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎలా ఓడిస్తారని నిలదీసిన మమత

కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎలా ఓడిస్తారని నిలదీసిన మమత

‘మీరు నిజంగా నిజాయితీగా మూడో ఫ్రంట్ ఏర్పాటు విషయమై పని చేస్తే మీతో కలిసి పని చేయడానికి సిద్ధమే. కానీ ద్వంద్వ ప్రమాణాలు పాటించే వారితో కలిసి పని చేయబోను' అని మమతాబెనర్జీ తేల్చి చెప్పారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా ఎలా సాద్యమని కేసీఆర్‌ను మమతాబెనర్జీ ప్రశ్నించారని వినికిడి. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.

మూడో కూటమి యత్నాలు సమర్ధించుకున్న కేసీఆర్

మూడో కూటమి యత్నాలు సమర్ధించుకున్న కేసీఆర్

పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ముగిసిన కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ గాంధీ కూడా.. భావ సారుప్య ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ పరిస్థితులు పూర్తిగా మార్చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని వార్తలొచ్చాయి. 71 ఏళ్లుగా సాగుతున్నదానికి భిన్నంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని ఆయన ప్రతిపాదించి కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో సమర్థించుకున్నారని వినికిడి.

 ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుకు మమత యత్నాలు

ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుకు మమత యత్నాలు

మీడియా ముందు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తనకు ఆపాదించొద్దని, ఆయన వాదన ఆయనను చెప్పుకోనివ్వండని మమతాబెనర్జీ పేర్కొన్నారు. ‘మాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి' అని మమతాబెనర్జీ తెలిపారు. 2019 ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలతో కలిసి ఆమోదయోగ్యమైన కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని మమతాబెనర్జీ తెలిపారు. ఇదిలా ఉంటే మంగళవారం మీడియాతో మాట్లాడిన నల్లగొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మమతాబెనర్జీతో చర్చల్లో మూడో ఫ్రంట్ ఊసే ఎత్తలేదన్నారని గుర్తు చేశారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసే విషయమై ఎటువంటి తొందర లేదని కూడా మమతాబెనర్జీ అన్నారని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.

ముఖాముఖీ చర్చలకు మమత, చంద్రబాబు మధ్య అంగీకారం

ముఖాముఖీ చర్చలకు మమత, చంద్రబాబు మధ్య అంగీకారం

సరిగ్గా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశం కావడానికి 24 గంటల ముందు మమతాబెనర్జీతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. ముఖాముఖీ సమావేశమై చర్చించుకునేందుకు వారిద్దరి మధ్య అంగీకారం కుదిరిందని సమాచారం. ఈ నెలాఖరులో మమతాబెనర్జీ హస్తినలో పర్యటించాలని, రాహుల్ గాంధీతోపాటు విపక్ష నేతలతో చర్చించాలని ప్రణాళిక రూపొందించారని తెలిసింది. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్‌తోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోపాటు ఎన్డీయేలో అసంత్రుప్తిగా ఉన్నశివసేన అధిపతి ఉద్దవ్ థాకరే వంటి వారితో ఆమెకు వ్యక్తిగత అనుబంధం ఉంది. అయితే లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి గల అనుబంధం ఒక్కటే ఆమె వెనుకడుగు వేసేలా కనిపిస్తున్నది.

English summary
Hyderabad: Both Telangana Chief Minister K Chandrashekar Rao and his Bengal counterpart Mamata Banerjee called their meeting in Kolkata “a good beginning” towards the formation of an alternative federal front to take on the ruling BJP in the 2019 general elections. But, as they say, the devil lies in the details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X