కేజ్రీవాల్ నెక్స్ట్ టార్గెట్ ఆ రెండు రాష్ట్రాలే; బీజేపీకి షాకిచ్చే విషయం చెప్పిన ఆమ్ ఆద్మీ నేత
పంజాబ్‌లో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ నెక్స్ట్ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ తర్వాత పంజాబ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న ఆప్ విజయోత్సవాలను జరుపుకుంటూనే తమ తరువాత టార్గెట్ పై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది.
Recommended Video
ఆమ్ ఆద్మీ పార్టీ తన తరువాత ఫోకస్ గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై పెట్టనున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అక్షయ్ మరాఠే వెల్లడించారు. తాము ఖచ్చితంగా గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. మా రాడార్‌లో తరువాత టార్గెట్ లో ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్పారు. గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లకు పార్టీ కార్యకర్తలను పంపుతోందని అక్షయ్ మరాఠే వెల్లడించారు. కచ్చితంగా గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద ప్రభావాన్ని చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం వచ్చిన ఆప్ ను ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తామని వెల్లడించారు. భారతదేశంలోని ప్రజలు పారదర్శకత లేని ప్రభుత్వాల పాలన వల్ల నలిగిపోతున్నారని, అవినీతితో కూడిన ప్రభుత్వాల వల్ల దెబ్బతింటున్నారని, పారదర్శకమైన పాలన అందించడానికి ఎవరికి పట్టం కట్టాలో ప్రజలు నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో ప్రజల కోసం పని చేయని రెండు పార్టీలు.. తొలిసారిగా రెండింటికి ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. జాతీయ పార్టీల రాజకీయ నాయకులు తమను ప్రాంతీయ పార్టీగా పరిగణించినప్పటికీ, గత పదేళ్లుగా తాము ప్రజా మద్దతు కూడగట్టడంలో ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చిన్న పార్టీగా భావించిన పార్టీ ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అక్షయ్ మరాఠే వెల్లడించారు. భవిష్యత్తు ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా చక్రం తిప్పుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications