గోవాలో గిరిజనులకు కేజ్రీవాల్ హామీల వర్షం; మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు, అటవీహక్కుల అమలుపై హామీ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం గోవాలోని షెడ్యూల్డ్ తెగల కోసం ఈసారి మరో హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వ్‌డ్ ఖాళీలను భర్తీ చేస్తామని, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఖర్చు పెంపొందిస్తామని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని, అలాగే మహిళలు మరియు నిరుద్యోగ యువతకు జీవనాధార ఆదాయాన్ని కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.షెడ్యూల్డు తెగల కోసం రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చే ప్రయోజనాలను అందిస్తానని హామీ ఇచ్చారు.

గిరిజునుల కోసం ప్రస్తుత ప్రభుత్వాల కంటి తుడుపు చర్యలపై కేజ్రీవాల్ ఫైర్
గిరిజన ఉప ప్రణాళిక కింద కేంద్రం మరియు రాష్ట్రం నుండి బడ్జెట్‌లో ఎంత నిధులు వచ్చినా షెడ్యూల్డ్ తెగల కోసం ఖర్చు చేయాలని పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రతి సంవత్సరం దాదాపు ₹2400 కోట్లు బడ్జెట్లో వారికి నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. కానీ ప్రతి సంవత్సరం వారి కోసం కేవలం రూ.200-300 కోట్లు మాత్రమే నామమాత్రంగా బడ్జెట్‌లో కేటాయిస్తున్నారని తెలిపారు. సంవత్సరం చివరి నాటికి కూడా అది ఖర్చు కాదని, గిరిజనుల సంక్షేమం విషయంలో పాలకుల శ్రద్ధ ఆ విధంగా ఉందని వెల్లడించారు. గిరిజునుల కోసం ప్రస్తుత ప్రభుత్వాల కంటి తుడుపు చర్యలపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.

మౌలిక వసతులు, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తామన్న కేజ్రీవాల్
ఫలితంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలలో రోడ్లు, నీళ్లు, కరెంటు లేవని, కాబట్టి, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మేము గిరిజన ఉప ప్రణాళికలోని మొత్తం డబ్బును గిరిజనుల కోసం ఖర్చు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన దాదాపు 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ అత్యవసర ప్రాతిపదికన భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఎస్టీ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు .

అటవీ హక్కుల చట్టంలో భాగంగా ఎస్టీలకు భూములపై హక్కు
ఎస్టీ వర్గాలకు చెందిన వారికి భూమిపై హక్కు కల్పించే అటవీ హక్కుల చట్టం గోవాలో అమలుకు నోచుకోలేదన్న కేజ్రీవాల్ ఎఫ్‌ఆర్‌ఏ అమలు చేయబడుతుందని, వారికి భూమిపై హక్కు ఇవ్వబడుతుంది అని పేర్కొన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికలలో షెడ్యూల్డ్ తెగల సభ్యులకు 12% సీట్లు రిజర్వ్ చేయబడతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆప్ యొక్క గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ కూడా తాము ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తాము, చట్టాలు తీసుకువస్తామని అన్నారు. ఎస్టీల సంక్షేమం కోసం ఆప్ కట్టుబడి ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications