కేజ్రీవాల్ అవినీతిపరుల లిస్టులో మోడీ, ఎపి నుండి జగన్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అవినీతి నేతలు అంటూ చిట్టా విప్పారు. జన్ లోక్‌పాల్ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు ఎఎపి జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కేజ్రీవాల్ దేశంలో అవినీతి నేతల పేర్లను చదివి వినిపించారు.

కేజ్రీవాల్ చదివిని లిస్టులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, కపిల్ సిబాల్మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, మాయావతి తదితరుల పేర్లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది.

Arvind Kejriwal

రాహుల్, మోడీలు తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని, ఇప్పుడు వారు గెలిస్తే అదంతా ప్రజల నుండి వసూలు చేస్తారని, ఇక వారి నుంచి మంచి పాలన ఎలా ఆశిస్తామని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒక్క అవినీతి నేత కూడా లోకసభ లోనికి ప్రవేశించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

కేజ్రీవాల్ చదివిన లిస్టులో... సుశీల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, సురేష్ కల్మాడీ, సల్మాన్ ఖుర్షీద్, కనిమొళి, అళగిరి, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ జిందాల్, నితిన్ గడ్కరీ, ప్రఫుల్ పటేల్, నరేంద్ర మోడీ, కపిల్ సిబాల్, ఎ రాజా, చిదంబరం, మాయావతి, యడ్యూరప్ప, రాహుల్ గాంధీ, శ్రీ ప్రకాశ్ జైస్వాల్, పవన్ కుమార్ బన్సాల్, అనంత్ కుమార్, అనూ టాండన్, తరుణ్ గొగొయ్, ప్రఫుల్ పటేల్, హెచ్‌డి కుమారస్వామి, కమల్ నాథ్, రాహుల్ గాంధీ, అను టండన్, జికె వాసన్, వైయస్ జగన్ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+