వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అధికారాలపై సుప్రీం కీలక తీర్పు: గవర్నర్ అధికారాలకు పరిమితి, కేజ్రీవాల్ హ్యాపీ, ‘హోదా లేదు’

|
Google Oneindia TeluguNews

Recommended Video

గవర్నర్ అధికారాలకు పరిమితి విధించిన సుప్రీం

న్యూఢిల్లీ: ఢిల్లీ పరిపాలన అధికారాలపై బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అంతేగాక, గవర్నర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించింది.

 గవర్నర్ అధికారాలకు పరిమితి

గవర్నర్ అధికారాలకు పరిమితి

ప్రభుత్వం సలహా మేరకే గవర్నర్ నిర్ణయాలుండాలని పేర్కొంది. నిర్ణయాలపై ప్రభుత్వం గవర్నర్‌కు సమాచారం ఇస్తే చాలని, ఆయన ఆమోదం అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మంత్రివర్గ నిర్ణయాలకు గవర్నర్ విలువ ఇవ్వాలని తెలిపింది. అయితే, వాస్తవ అధికారంతోపాటు జవాబుదారీతనం కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

గవర్నర్ జోక్యంపై...

గవర్నర్ జోక్యంపై...

ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని, దీంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ పరిపాలనపై ఎవరికి అధికారం ఉంటుందో తెలపాలని కోరింది. అంతేగాక, ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని కూడా కోరింది.

రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరదు

రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరదు

అయితే, ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, భూ వ్యవహరాలు రాష్ట్ర పరిధిలోకి రావని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది.

 కేంద్ర, రాష్ట్రాల మధ్య..

కేంద్ర, రాష్ట్రాల మధ్య..

రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఒక్కరూ నడుచుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని తెలిపింది.
కాగా, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమని, గవర్నరే ఇక్కడ సుప్రీం అని గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ సాయంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధిస్తుందోని ఆరోపించింది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్ సర్కారుకు సానుకూలంగా ఉండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
The Supreme Court put to rest the long standing tussle between the Delhi Governor and Lieutenant Governor. It said that the role of the LG is to help and not be obstructionist. The Supreme Court observed that if legitimate decisions are delayed by the Lieutenant Governor, then collective responsibility of the government stands negated. The court also held that the Union Government must not usurp powers on maters within the domain of the legislature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X