వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady leader: ఎమ్మెల్యే టిక్కెట్, మీరు కాదు, నేను గుండు కొట్టుకుంటా, ఏం చేస్తారో చేసుకోండి !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/చెన్నై: కేరళ శాసన సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సాక్షాత్తు ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ కు టిక్కెట్ ఇవ్వడానికి హైకమాండ్ నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి హైకమాండ్ మొండి చెయ్యి చూపించడంతో మహిళా విభాగం నాయకురాలికి చిర్రెత్తిపోయింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే నిరసన వ్యక్తం చేసిన ఆ లేడీ లీడర్ ఆమె గుండు కొట్టించుకుని నిరసన వ్యక్తం చేశారు. మీరు నాకు గుండు గియ్యాలని చూశారు. అందుకు అవకాశం ఇవ్వకుండా నేను గుండు కొట్టించుకుంటున్నానని పార్టీకి రాజీనామా చేసిన ఆ లేడీ లీడర్ హైకమాండ్ మీద విరుచుకుపడ్డారు.

Milk: నాకు మిల్క్, మంత్రికి మిల్క్ షేక్, సీడీ స్కెచ్ తెలుసు, ప్రియుడు, 70 సీసీటీవీలు, హైదరాబాద్ ?Milk: నాకు మిల్క్, మంత్రికి మిల్క్ షేక్, సీడీ స్కెచ్ తెలుసు, ప్రియుడు, 70 సీసీటీవీలు, హైదరాబాద్ ?

92 సీట్లు...... 86 సీట్లకు గ్రీన్ సిగ్నల్

92 సీట్లు...... 86 సీట్లకు గ్రీన్ సిగ్నల్

కేరళ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 92 నియోజకవర్గాల్లో 86 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. మిగిలిన ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు కేరళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ తెలిపారు. న్యూఢిల్లీలో రామచంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ హైకమాండ్‌తో చర్చించిన తర్వాత ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.

 యువతకు పెద్దపీట

యువతకు పెద్దపీట

కేరళ శాసనసభ ఎన్నికల్లో యువతకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. 92 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 46 మంది కాంగ్రెస్ అభ్యర్థులు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నారు. మిగిలిన 50 శాతం నియోజక వర్గాల్లో సీనియర్లు పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.

మేడమ్ కు మొండిచెయ్యి

మేడమ్ కు మొండిచెయ్యి

కేరళలోని ఎత్తునూరు శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని లతికా సుభాష్ అనేక ప్రయత్నాలు చేశారు. కేరళ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లతికా సుభాష్ కు కచ్చితంగా ఎమ్మెల్యే సీటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే లేడీ లీడర్ లతికా సుభాష్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొండి చెయ్యి చూపించడంతో ఆమె అనుచరులు షాక్ అయ్యారు.

మీరు కాదు నేను గుండు కొట్టుకుంటా

మీరు కాదు నేను గుండు కొట్టుకుంటా


కాంగ్రెస్ పార్టీ జాబితాలో లతికా సుభాష్ కు బదులుగా వేరే వ్యక్తి పేరు విడుదల కావడంతో ఆమె మండిపడ్డారు. కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు లతికా సుభాష్, ఆమె మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా నాకు గుండకొట్టాలని మీరు ప్రయత్నించారు. ఆ చాన్స్ మీకు ఇవ్వను అంటూ లతికా సుభాష్ తల వెంట్రుకలు కత్తిరించుకుని నున్నగా గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు.

మేడమ్ దెబ్బకు లీడర్స్ మైండ్ బ్లాక్

మేడమ్ దెబ్బకు లీడర్స్ మైండ్ బ్లాక్

కేరళ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం చీఫ్ లతికా సుభాష్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే గుండు గీయించుకుని నిరసన వ్యక్తం చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హడలిపోయారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన లతికా సుభాష్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని, తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చిచెప్పడంతో ఆ పార్టీ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యింది.

English summary
Lady leader: A day after she resigned as Mahila Congress chief and shaved off her head as a mark of protest following denial of ticket, Kerala leader Lathika Subhash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X