కిమ్ జాంగ్ ఉన్‌ను ప్రశంసించిన కేరళ ముఖ్యమంత్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఉత్తర కొరియాను, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను ప్రశంసించారు. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నందుకు కితాబిచ్చారు.

క్షిపణి ప్రయోగాలు, అణు పరీక్షలతో ఉత్తర కొరియా ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియా అగ్రదేశం ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గడం లేదని, విజయవంతంగా అమెరికా అమెరికా వ్యతిరేక అజెండా అనుసరిస్తోందని పినరాయి అన్నారు.

Kerala CM Pinarayi Vijayan praises North Korea for 'successfully defending US pressure'

సామ్రాజ్యవాద శక్తులను అడ్డుకోవడంలో చైనా కంటే మెరుగ్గా ఉత్తర కొరియా పని చేస్తోందన్నారు. సామ్రాజ్యవాద శక్తులపై చైనా పోరాటం ప్రజల అంచనాలకు తగినట్లుగా లేదన్నారు. సామ్రాజ్యవాద శక్తులతో ఎలా పోరాడాలో ఉత్తర కొరియా మంచి ఉదాహరణ అన్నారు.

కొద్ది రోజుల క్రితం సీపీఎం పార్టీ ఫ్లెక్సీలో కిమ్ జాంగ్ ఉన్న ఫోటో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పినరాయి విజయన్ ఉత్తర కొరియాను ప్రశంసించడం గమనార్హం. కిమ్‌ను ఓ ముఖ్యమంత్రి వెనుకేసుకొస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kerala chief minister Pinarayi Vijayan on Tuesday praised North Korea for for not bowing to the pressure imposed by the US.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి