కేరళ కోర్టు సంచలన తీర్పు- బీజేపీ నేత హత్య కేసులో 15 మంది పీఎఫ్ఐ కార్యకర్తలకు ఉరిశిక్ష...

కేరళలోని అలప్పుజ కోర్టు ఇవాళ ఓ సంచలన తీర్పు ప్రకటించింది. కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత సంస్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన 15 మంది సభ్యులకు ఉరిశిక్ష విధిస్తూ అలప్పుజ కోర్టు తీర్పు వెలువరించింది. బీజేపీ నేతను హత్య చేసిన తీరు చాలా క్రూరంగా ఉందని, దోషులకు గరిష్ట శిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు..ఈ తీర్పు ఇచ్చింది.

కేరళ బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాసన్ ను శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ సభ్యులు అతని తల్లి, బిడ్డ, భార్య ముందే క్రూరంగా చంపడం ఓ అరుదైన హత్య అని ప్రాసిక్యూషన్ చేసిన వాదనతో అలప్పుజ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో ఈ హత్యకు కారణమైన 15 మందిని దోషులుగా నిర్ధారిస్తూ వీరికి ఉరిశిక్షను ఖరారు చేసింది. 2021 డిసెంబర్ 19న ఈ హత్య జరిగింది. ఇందులో పీఎఫ్ఐతో పాటు సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) సభ్యులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

kerala court awards death sentence to 15 pfi activists in bjp leader murder case

ఈ కేసులో నిందితులుగా ఉన్న 15 మందిలో ఒకరి నుంచి ఎనిమిది మంది వరకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు ఈ ఏడాది జనవరి 20న అలప్పుజ కోర్టు నిర్ధారించింది. నలుగురు వ్యక్తులు (నిందితులు తొమ్మిది నుండి 12 వరకు) హత్యకు పాల్పడినట్లు గుర్తించింది. నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు వీరు మారణాయుధాలతో సంఘటనా స్థలానికి వచ్చారు.శ్రీనివాసన్ తప్పించుకోకుండా అడ్డుకోవడంతో పాటు అతని అరుపులు విని ఇంట్లోకి ఎవరైనా రాకుండా చేయడం వారి లక్ష్యంగా తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+