“భార్యలను పడకగదికే ఉంచాలి!”: వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర దుమారం
కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీ నాయకుడు సయ్యద్ అలీ మజీద్ స్థానిక ఎన్నికల విజయం తర్వాత చేసిన స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. మలప్పురం జిల్లాలో తన 47 ఓట్ల విజయాన్ని వేడుక చేసుకునే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే కీలక ఎన్నికలకు ముందు అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి ఈ ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతున్నాయి.
ముస్లిం లీగ్ అభ్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు
గత వారం కేరళలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన తరుణంలో నిర్వహించిన సభలో సీపీఎం నాయకుడు సయ్యద్ అలీ మజీద్ ప్రధానంగా ముస్లిం లీగ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సభకు మహిళలు సహా వందలాది మంది వామపక్ష కార్యకర్తలు హాజరయ్యారు. ముస్లిం లీగ్ మహిళా అభ్యర్థులను నిలబెట్టడాన్ని ప్రశ్నిస్తూ.. ఓట్ల కోసం ఆ పార్టీ మహిళలను వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.

అంతటితో ఆగకుండా.. ఓట్ల కోసం తమ పార్టీ మహిళలను మహిళలను చూయించబోమని చెబుతూ.. "మా ఇళ్లలో కూడా వివాహిత మహిళలు ఉన్నారు.. కానీ ఓట్ల కోసం వారిని చూపించడానికి కాదు. వారిని ఇంట్లోనే కూర్చోనివ్వండి.. పడుకోవడానికి, పిల్లలను కనడానికి భార్యలను వివాహం చేసుకోవాలి" అంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. "అందుకే సాంప్రదాయకంగా వివాహాలు ఏర్పాటు చేసేటప్పుడు కుటుంబాలు వంశాన్ని, నేపథ్యాన్ని ధ్రువీకరిస్తాయి..." అని కూడా ఆయన అన్నారు. మజీద్ చేసిన ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు కేరళలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
'Don’t parade women for votes'; CPM leader in Kerala faces backlash over remarks on women after local body poll victory pic.twitter.com/ql0gTA74jv
— Athique Haneef (@Derwish27683791) December 15, 2025
ఎన్నికల ఫలితాలు: అధికార సీపీఎంకు ఎదురుదెబ్బ
స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF), ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగింటిలో విజయం సాధించింది. కన్నూర్ కార్పొరేషన్‌ను నిలబెట్టుకోవడంతో పాటు గతంలో LDF ఆధీనంలో ఉన్న కొచ్చి, కొల్లాం కార్పొరేషన్లను కూడా కైవసం చేసుకుంది. ఎల్డీఎఫ్‌కు మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) గెలుచుకుంది. గతంలో 100 సీట్లున్న కార్పొరేషన్‌లో CPI(M)కి 51 సీట్లు ఉండగా.. ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్య 101కి పెరిగింది. ఎన్డీఏ 50 సీట్లు, ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 గెలుచుకోగా.. మిగిలిన రెండు స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications