ఏడాది కాలంగా యువతిపై అత్యాచారం..మత మార్పిడి: పోలీస్ కమిషనర్ కు బీజేపీ మహిళా ఎంపీ ఫిర్యాదు.. !
బెంగళూరు: ఓ యువతిపై దారుణంగా ఆకృత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్నో, మొన్ననో చోటు చేసుకున్న ఘటన కాదు ఇది. ఏడాదికాలంగా ఆ బాలిక వారి చెరలోనే ఉంటోంది. ఈ విషయం తన దృష్టికి రాగానే శరవేగంగా స్పందించారు భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీ. దీనిపై ఆమె పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనికోసం ఆ మహిళా ఎంపీ స్వయంగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రావడం చర్చనీయాంశమైంది.
ఆమే- శోభా కరంద్లాజే. కర్ణాటక బీజేపీ రాష్ట్రశాఖలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాయకురాలు. కర్ణాటకలోని ఉడుపి-చిక్ మగళూరు లోక్ సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆదివారం ఉదయం బెంగళూరు ఇన్ ఫాంట్రీ రోడ్ లో ఉన్న నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ భాస్కర్ రావును కలిశారు. యువతిపై ఏడాదికాలంగా కొనసాగుతున్న అత్యాచార సంఘటనపై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

బాధితురాలు కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతానికి చెందిన యువతి అని, ప్రేమ పేరుతో ఓ ముస్లిం యువకుడు ఆమెను లోబర్చుకున్నాడని అన్నారు. అనంతరం ఆ యువతిని నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడుతున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాసర్ గోడ్ నుంచి తొలుత మంగళూరుకు, అనంతరం బెంగళూరుకు తీసుకొచ్చాడని చెప్పారు. అతని బారి నుంచి ఆ యువతిని వెంటనే విడిపించాలని కోరారు.
అనంతరం శోభా కరంద్లాజే విలేకరులతో మాట్లాడారు. సెక్యులర్ అని చెప్పుకొంటోన్న కేరళ ప్రభుత్వం.. ఈ ఉదంతంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక వర్గానికి న్యాయం చేయాలనే పేరుతో మెజారిటీ వర్గ ప్రజలను కేరళ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. కాసర్ గోడ్ యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను బలవంతంగా మతం మార్చించిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications