దృశ్యం: విద్యార్థిని హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్: నిందితుడి మృతి: చెట్టుకు వేలాడుతూ మృతదేహం

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేరళలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హత్య కేసులో పోలీసుల విచారణ అనూహ్య మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన విద్యార్థినికి అతను సమీప బంధువు కూడా కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతని పేరు అరుణ్ అలియాస్ అణు.

 రిలేషన్ షిప్‌లో ఉంటూ..

రిలేషన్ షిప్‌లో ఉంటూ..

రేష్మ అనే విద్యార్థిని కేరళలోని ఇడుక్కి జిల్లా పళ్లివాసల్‌లో ఈ నెల 19వ తేదీన రేష్మ అనే విద్యార్థిని దారుణహత్యకు గురయ్యారు. పల్లివాసల్ శివార్లలోని పవర్ హౌస్ వద్ద ఆమె మృతదేహాన్ని రక్తపుమడగులో గుర్తించారు పోలీసులు. అదే రోజు ఉదయం రేష్మ, అరుణ్ జంటగా వెళ్తోన్న దృశ్యాలు సీసీటీవీ పుటేజీల్లో రికార్డ్ అయ్యాయి. సమీప బంధువు కావడం వల్ల వారిద్దరూ తరచు కలిసి తిరిగే వాళ్లని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారిద్దరూ కొద్దిరోజుల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. అదే రోజు రాత్రి రేష్మ హత్యకు గురయ్యారు. పల్లివాసల్ శివార్లలో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉలితో దాడి చేసిన ఆనవాళ్లు ఆమె మృతదేహంపై కనిపించాయి. అప్పటి నుంచి అరుణ్ కనిపించకుండా పోయాడు.

అనుమానాలన్నీ అతని పైనే..

అనుమానాలన్నీ అతని పైనే..

రేష్మ హత్యోదంతంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోన్న సమయంలోనే అరుణ్ అదృశ్యం అయ్యాడు. హత్య చోటు చేసుకున్న రోజు నుంచీ అతను కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రేష్మ హత్యకు గురికావడానికి ముందు.. చివరిసారిగా అరుణ్‌తో కనిపించడం, హత్య జరిగిన ప్రదేశంలోనే అతని మొబైల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ కావడం వంటి పరిణామాలతో అరుణ్ ప్రమేయం ఉంటుందని పోలీసులు నిర్దారించుకున్నారు.

నాలుగు రోజుల తరువాత.. చెట్టుకు వేలాడుతూ..

నాలుగు రోజుల తరువాత.. చెట్టుకు వేలాడుతూ..

రేష్మ హత్య జరిగిన నాలుగు రోజుల తరువాత.. అరుణ్ మృతదేహం పోలీసులకు లభించింది. రేష్మ హత్యకు గురైన ప్రదేశం నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఓ నిర్జన ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత- కొందరు స్థానికులు అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేష్మను హత్య చేసిన తరువాత.. అతను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+