హిజాబ్ ఇస్లాంలో భాగం కాదు.. కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటకలో ఆరుగురు విద్యార్థినులతో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. భారత దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. పార్టీలు కూడా ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. హిజాబ్ వివాదం నేపథ్యంలోనే .. ప్రధాని మోదీ సహితం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని తాము ముస్లిం మహిళను అండగా ఉన్నామని స్ఫష్టం చేశారు.
మహిళల డ్రెస్ కోడ్‌తో సంబంధం లేదు
దేశ వ్యాప్తంగా హిజాబ్ వివాదంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ఇస్లాంలో భాగం కాదన్నారు. హిజాబ్ గురించి ఖురాన్ లో ఏడు సార్లు ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. కానీ, ఇది మహిళల డ్రెస్ కోడ్‌తో సంబంధం లేదని తెలిపారు. హిజాబ్ చుట్టూ ఉన్న వివాదం.. ముస్లిం మహిళల చదువుకు ఆటంకం కలిగించే కుట్రలో భాగమేని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లి చదువు కొనసాగించాలని గవర్నర్ సూచించారు. సిక్కు మతంలో తలపాగా మాత్రం ముఖ్యమైన భాగమని చెప్పుకొచ్చారు.

కర్ణాటక హైకోర్ట్ పరిధిలో వివాదం
కర్ణాటక ఉడిపి నియోజకర్గంలోని ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరిస్తూ కళాశాలకు, స్కూళ్లకు రావడాన్ని మరో వర్గం విద్యార్థులు వ్యతిరేఖిస్తూ.. కాషాయ కండువాలతో రావడం వివాదానికి దారితీసింది. తీవ్ర ఉద్రిక్తలకు తావిచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వివాదం కర్ణాటక హైకోర్ట్ పరిధిలో ఉంది. ఎలాంటి మతపరమైన వేషధారణతో రావద్దంటూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

హిజాబ్‌కు కాంగ్రెస్ మద్దతు..
మరోవైపు ఈ వివాదంపై రాజకీయ నాయకులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ వివాదం మరింత రచ్చకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు హిజాబ్‌కు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ మాత్రం పాఠశాలల్లో అంతా సమానంగా ఉండాలని డ్రెస్ కోడ్ తప్పనిసరి అంటూ వ్యాఖ్యలు చేస్తోంది. తాము ముస్లిం మహిళలకు అండగా ఉంటామని పేర్కొంటుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications