రైళ్లోంచి కిందకు తోసేసి..: రేపిస్ట్‌కు ఉరే సరన్న హైకోర్టు

బాధిత మహిళపై అమానుషంగా ప్రవర్తించడం ద్వారా అతడు మానవ జీవన విలువలనే మంట గలిపాడని, ఈ నేర స్వభావం సదరు మహిళ శరీరంపై ఉన్న గాయాలతో స్పష్టమైందని న్యాయమూర్తులు రామచంద్రన్ నాయర్, కేమల్ పాషాలతో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
దిగువ కోర్టు తీర్పుపై గోవిందచామియా చేసిన అప్పీలును తిరస్కరించింది. అత్యంత హేయంగా, క్రూరంగా, అమానుషంగా దారుణ హత్యకు అతడు పాల్పడ్డాడని, ఇంతటి ఘోరాన్ని అత్యంత అరుదైన నేరంగా పరిగణించి శిక్ష విధించకపోతే మౌలిక విధులను తాము విస్మరించినట్లే అవుతుందని 359 పేజీల తీర్పు పాఠంలో న్యాయమూర్తులు పేర్కొన్నారు.
2011 ఫిబ్రవరి 1న త్రిసూర్ జిల్లా పొరుగున ఉన్న ఓ ప్రాంతంలో ఈ అత్యాచారం, హత్య ఘటన జరిగింది. షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న ఆ మహిళ ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఎర్నాకుళం - షోమూర్ పాసింజర్ రైలు ఎక్కింది. మహిళల కంపార్టుమెంటులో ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసేందుకు అతడు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపరచి రైలు నుంచి తోసేశాడు. అనంతరం తానూ కిందకు దూకి, ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. ఆరు రోజుల తర్వాత బాధిత మహిళ మరణించింది.












Click it and Unblock the Notifications