టాప్ మోడల్‌పై గ్యాంగ్ రేప్ - కారులో: మహిళ సహా నలుగురు..!!

తిరువనంతపురం: కేరళలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. టాప్ మోడల్ సామూహిక అత్యాచారానికి గురయ్యారు. గురువారం రాత్రి ఘాతుకం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురిలో ఒక మహిళ కూడా ఉన్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

ఎర్నాకుళం సమీపంలోని కక్కనాడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు.. కోచికి చెందిన మోడల్. వయస్సు 19 సంవత్సరాలు. ఆమె స్వస్థలం కాసర్‌గాడ్. మోడలింగ్ రంగంలో స్థిరపడిన ఆమె కోచిలో నివసిస్తోన్నారు. గురువారం రాత్రి ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిపురం కొచ్చిన షిప్‌యార్డ్ సమీపంలోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన ఓ డీజే పార్టీకి హాజరయ్యారు. తోటి మోడల్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె స్వరాష్ట్రం రాజస్థాన్‌.

 Kerala horror: A 19-year-old model from Kochi was gang-raped inside a car, Police have detained 4

ఎర్నాకుళం, కొడుంగుళ్లూర్‌‌కు చెందిన ముగ్గురు యువకులు ఈ డీజే పార్టీలో పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన మోడల్‌కు ఈ ముగ్గురు అత్యంత సన్నిహితులు. డీజే పార్టీలో వారందరూ మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న సమయంలో బాధిత మోడల్‌ను బ్లాక్ మహీంద్రా థార్ కారులో ఎక్కించుకుని కక్కనాడ్ నగరం మొత్తం తిప్పుతూ ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

స్ప‌హ తప్పిన స్థితిలో బాధితురాలిని కక్కనాడ్‌లో ఆమె దిగిన లాడ్జి ముందు వదిలేసి పారిపోయారు. లాడ్జి సిబ్బంది తొలుత కక్కనాడ్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను కలమస్సేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు.

బాధితురాలి స్టేట్‌మెంట్ ప్రకారం- రాజస్థాన్‌కు చెందిన తోటి మోడల్‌తో పాటు అత్యాచారం చేసిన ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారిపై పలు ఐపీసీలోని 370, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తునకు ఆదేశించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని సూచించింది. బాధిరాలికి నాణ్యమైన చికిత్సను అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిందితులపై కఠిన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+