కేరళలో తగ్గుతున్న కరోనా కేసులు.. 74 మంది మృతి
కేరళలో కరోనా ప్రభావం కాస్త ఎక్కువగానే ఉన్నది. ఇవాళ కొత్తగా 12,297 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 47,20,233కు చేరింది. ఇవాళ కొత్తగా 74 మంది కరోనా బాధితులు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 25,377కు పెరిగింది. మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గత కొన్ని రోజులుగా ఎక్కువగానే ఉంటుంది. ఇవాళ కూడా 16,333 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.

దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 45,57,199కి చేరింది. కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం కేరళలో 1,37,043 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో కరోనా ఉధృతి బాగా ఉండగా.. అందులో ఎర్నాకుళం, త్రిస్సూర్, తిరువనంతపురం, కోజికోడ్ జిల్లాలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications