లవ్ జిహాద్ కేసు: హదియాను కోర్టుకు తీసుకురావాలన్న సుప్రీం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా కేరళ రాష్ట్రంలో 'లవ్ జిహాద్' కేసులు పెరిగిపోతున్నాయి. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని మతం మార్చి పెళ్లి చేసుకోవడాన్నే 'లవ్ జిహాద్'గా పేర్కొంటున్నారు. కాగా, ఇస్లామిక్ స్టేట్‌తో లింకులు ఉన్న వారు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు కేరళలో ఇటీవలి కాలంలో పెరిగిపోతుండటం వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే హదియా అనే 24 ఏళ్ల అమ్మాయి కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ముందు సోమవారం వాదనలు జరిగాయి. హదియాను విచారణ కోసం నవంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు కోర్టుకు తీసుకురావాలంటూ సుప్రీం ఆదేశించింది. హదియా మేజర్ అయినందున ఆమె అభిప్రాయమే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, తన కుమార్తెను బలవంతంగా మతం మార్చారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.

Kerala Love Jihad: Present Hadiya before us on November 27, 3 pm says SC

కాగా, హదియా అసలు పేరు అఖిలా అశోకన్. మతం మార్చుకుని ఫాహిన్ జెహాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, అయితే షాఫిన్ జెహాన్‌కు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయని ఆమె తండ్రి ఆరోపించాడు. కేరళ కోర్టు వరకు వీళ్ల కేసు వెళ్లింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు షాఫిన్ నుంచి హదియాను దూరం చేశారు.

గత ఐదు నెలలుగా ఆ అమ్మాయి తండ్రి దగ్గరే ఉంటోంది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది.దీంతో నవంబర్ 27వ తేదీన జరిగే విచారణను కెమెరాల్లో చిత్రీకరించాలని హదియా తండ్రి కోర్టును కోరాడు. కానీ, న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాత్రం ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు. ఓపెన్ కోర్టులోనే విచారణ సాగుతుందన్నారు. కేరళలో లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయని ఇటీవలే ఎన్‌ఐఏ హెచ్చరించడం గమనార్హం. ఇప్పటికే 89కేసులకు పైగా గుర్తించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ లవ్ జిహాద్ కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court on Monday observed that there was no need for any investigation into the Hadiya case from Kerala. The court is hearing a petition filed by a Muslim man who challenged an order that annulled his marriage on charges of love jihad. The court directed that the Hadiya be presented before the court on November 27 at 3 pm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి