ప్రాణం తీసిన ఇడ్లీ, వరద బాధితులకు సహాయం

ఓనమ్ పండుగని సందర్బంగా నిర్వహించిన ఇడ్లీ పోటీల్లో పాల్గోన్న 55 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఇడ్లీలు వేగంగా తినే పోటీలో పాల్గోన్న కందముతన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇడ్లీ పోటీల్లో కందముతన్ వేగంగా తినడానికి ప్రయత్నించి.. ఆ ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కోని, దాంతో ఊపిరి ఆడకపోవడంతో స్దానిక ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కందముతన్ మరణించాడని పోలీసులు ధృవీకరించారు.
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తమిళనాడు, ఒడిశా సహాయం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు పలు రాష్ట్రాలు తమ వంతుగా సాయం ప్రకటిస్తున్నాయి. తాజాగా వరద బాధితుల సహాయార్థం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించగా, అటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా రూ. 5 కోట్లు సాయం ప్రకటించారు. ఎలాంటి ఇతర సహాయమైనా చేస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకు 200 మంది మృత్యువాడ పడగా, వేలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications