షాకింగ్: మనిషి ఆత్మ బయటికెలా వస్తుందో చూడాలనుకున్నాడు.. అందుకని కుటుంబ సభ్యులనే..
మనిషి మరణించినప్పుడు శరీరంలోని ఆత్మ బయటికెలా వస్తుందో చూడాలనుకున్నాడు అతడు. అందుకోసం కని పెంచిన తల్లిదండ్రులను, తోడబుట్టిన సోదరిని చంపేశాడు.
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో సంపన్న వర్గాలు నివసించే నథెన్‌కోడ్ కాలనీలో ఓ యువకుడు తన కుటుంబానికే చెందిన నలుగురిని దారుణంగా హతమర్చాడు. గత నెల 31న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాలనీకి చెందిన, కడెల్ జీన్సన్ రాజా(30) అనే యువకుడు ఆస్ట్రేలియాలో ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి 2009లో భారత్‌కు తిరిగొచ్చి ఇక్కడ వీడియో గేమ్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. సంఘటన జరిగిన రోజు తాను రూపొందించిన వీడియో గేమ్ డెమో చూపించేందుకని తన తల్లి జీన్ పద్మ(58)ను పైఅంతస్తుకు పిలిచాడు.
ఆమె కంప్యూటర్ ముందు కూర్చోగానే గొడ్డలితో తలపై కొట్టి చంపేశాడు. ఈ ఘటన జరగడానికి ముందు అతడి తండ్రి రాజా తుకారాం(60), సోదరి కరోల్(25) బయటికి వెళ్లారు.కొంతసేపటి తరువాత వారు ఇంటికి తిరిగి రాగా, అదను చూసుకుని వారినీ హతమార్చాడు.

శవాల నుంచి దుర్గంధం వెలువడకుండా ఉండేందుకు ముగ్గురి మృతదేహాలకు ఫినాయిల్, ఇతర రసాయనాలు పూశాడు. తర్వాత, తమ ఇంట్లోనే ఉంటున్న, కళ్లు కనిపించని లలిత జానే(70) అనే బంధువును కూడా పై అంతస్తుకు తీసుకెళ్లి చంపేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. అనంతరం మృతదేహాలను పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
అతడి ఇంట్లోంచి పొగ రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న కడెల్ జీన్సన్ రాజా వారు వచ్చే లోపే పరారయ్యాడు. ఇన్నాళ్లూ తీవ్రంగా గాలించిన పోలీసులు ఇటీవల జీన్సన్ రాజాను అరెస్టు చేశారు.
అసలు అతడీ హత్యలు చేయడానికి వెనుక ఉన్న కారణం అతడి నోటి నుంచి విన్న పోలీసులు షాక్ కు గురయ్యారు. ''నేను సైతాన్ ఆరాధకుడిని. నేను మనుషుల నుంచి ఆత్మలను వేరు చేసే ప్రయోగాలు చేస్తున్నాను. ప్రయోగంలో భాగంగానే వారిని చంపాను. ఇదంతా 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్' ప్రయోగాల్లో భాగం. చనిపోయిన మనుషల నుంచి ఆత్మ ఎలా బయటకు వస్తుందో చూడాలనుకున్నాను'' అని జీన్సన్ రాజా చెప్పాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications