ట్విస్ట్: తల్లి అనుమతితోనే మైనర్‌పై థియేటర్లో లైంగిక దాడి, వివాహేతర సంబంధం
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని మళప్పురానికి చెందిన వ్యాపారవేత్త మెయిదీన్ కుట్టి సినిమా థియేటర్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకొంది. తల్లి అనుమతితోనే బాలికపై వ్యాపారవేత్త లైంగిక దాడికి దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బాధితురాలి తల్లిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఈ కేసు సంచలనం సృష్టించింది.
ఏప్రిల్ 18వ తేదిన కేరళ రాష్ట్రంలోని ఏడప్పల్ లో ఉన్న సినిమా థియటర్‌లో 35 ఏళ్ళ మహిళ, ఆమె మైనర్ కూతురితో పాటు వ్యాపారవేత్త సినిమాకు వెళ్ళారు. థియేటర్లోనే మైనర్ బాలికపై ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
అయితే సినిమాథియేటర్లోని సీసీకెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో వైపు బాధితురాలిని విచారించిన సమయంలో తల్లి ప్రోత్సాహంతోనే ఈ దారుణం చోటు చేసుకొందని తేలింది.

తల్లి ప్రోత్సాహంతోనే కూతురిపై వేధింపులు
ఏప్రిల్ 18వ తేదిన కేరళలోని ఏడప్పల్ లో ఉన్న ఓ సినిమా థియేటర్‌లో 35 ఏళ్ళ మహిళతో పాటు, మైనర్ బాలికతో వ్యాపారవే్త మొయిద్దీన్ కుట్టి సినిమాకు వెళ్ళాడు. సినిమా థియేటర్లోనే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు బాధితురాలి తల్లి ఈ మేరకు వ్యాపారవేత్తకు సహకరించిందని మైనర్ బాలిక పోలీసులకు విచాచణ సమయంలో వెల్లడించింది. దీంతో బాధితురాలి తల్లిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

లైంగిక వేధింపుల కోసమే
వ్యాపారవేత్త సినిమాకు కేవలం మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకే సినిమాకు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి కూడ ఈ సినిమాకు వచ్చింది. వ్యాపారవేత్త తనకు చేరో పక్కన తల్లిని, కూతురును కూర్చోపెట్టుకొన్నాడు. సినిమా ప్రారంభమైన తర్వాత మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక బిగ్గరగా ఏడ్వడంతో ప్రేక్షకులు థియేటర్ యజమానికి ఫిర్యాదు చేశారు. అయితే థియేటర్లో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాల్లో వ్యాపారవేత్త దాష్టీకం రికార్డైందని పోలీసులు చెబుతున్నారు.ఈ దృశ్యాలను పోలీసులు సేకరించినట్టు సమాచారం.

తల్లి ప్రోత్సాహంతోనే వేధింపులు
థియేటర్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి బాధితురాలు విచారణలో పోలీసులకు ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తరచూ తమ ఇంటికి ఆ వ్యాపారవేత్త వచ్చేవాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. గతంలో కూడ తనపై అతను తప్పుడుగా వ్యవహరించాడు ఈ విషయాన్ని అమ్మతో చెబితే ఆమె దూషించిందని బాధితురాలు చెప్పారు. తమకు బట్టలు, భోజనం పెట్టించేవాడని బాధితురాలు చెప్పారు.

మహిళ కమిషన్ ఛైర్మెన్ జోక్యంతో కేసు
ఈ కేసులో వ్యాపారవేత్తపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకాడరు. కానీ, ఈ థియేటర్లో చోటు చేసుకొన్న దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్ళు పెద్ద ఎత్తున ప్రసారం చేశాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను కూడ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.దీంతో కేరళ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ ఎ:సీ జోసెఫిన్ రంగంలోకి దిగారు. ఈ కేసును దగ్గరుండి పర్యవేక్షించారు. ఏప్రిల్ 28న, ఛైల్డ్ లైఫ్ సహయక సిబ్బంది అందించిన వీడియోను జోసెఫిన్ కేరళ పోలీసు శాఖకు అందించింది. మే 12వ తేదిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించారు. మైనర్ బాలిక తల్లిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని నిర్భయ సెంటర్ కు తరలించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications