అజాగ్రత్తతో ఉండి ఉంటే ఈ కేరళ నర్సింగ్ యువతుల బతుకులు ఏమౌనో..?
బెంగళూరులో యువతులను విదేశాలకు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కేరళకు చెందిన 32 మంది నర్సింగ్ విద్యార్థులను ఈ ముఠా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్మేనియాకు తరలిస్తుండగా విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

లేని కోర్సు ఉన్న యూనివర్శిటీకి వెళుతుండటంతో అనుమానం
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో యువతులను విదేశాలకు తరలించి వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు బెంగళూరు ఇమ్మిగ్రేషన్ అధికారులు. కేరళకు చెందిన 32 మంది నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులను టామ్ అనే వ్యక్తి అర్మేనియాకు తీసుకుపోయేందుకు ప్రణాళిక రచించాడు. నర్సింగ్ పూర్తి చేసుకున్న యువతులకు విదేశాల్లో మంచి ఉద్యోగాలు రావాలంటే జర్మన్ భాష తప్పకుండా నేర్చుకోవాల్సిందే అంటూ నమ్మ బలికి వారిని జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆఫ్ అర్మేనియా లో జర్మనీ భాష నేర్పిస్తారని నమ్మబలికాడు.అంతేకాదు కోర్సు రెండు నెలల్లో పూర్తి అవగానే తిరిగి తనే టికెట్ డబ్బులు ఇచ్చి భారత్‌కు తీసుకువస్తానని కూడా చెప్పాడు.

జర్మనీ భాష నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎర
జర్మనీ భాష నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు విమానం టికెట్ కోసం రూ.30వేలు కోర్సు కోసం 1200 డాలర్లు టామ్‌కు చెల్లించారు. ఇక మంగళవారం ఉదయం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి అర్మేనియా వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉండటంతో ఈ యువతులందరూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరితో పాటు టామ్‌కూడా చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ చేయగా అసలు యూనివర్శిటీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆఫ్ అర్మేనియాలో జర్మన్ భాష కోర్సు లేదని తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి టామ్‌ను అప్పగించారు.

వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం
ఓ పేపర్లో వచ్చిన ప్రకటన చూసి టామ్‌ను కలవడం జరిగిందని ఓ యువతి పేర్కొంది. టామ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని మంగళూరులో నిర్వహిస్తుంటారని పోలీసులు తెలిపారు. పోలీసులు మొత్తం 32 మంది యువతుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. యువతులు అప్లై చేసుకున్న యూనివర్శిటీలో జర్మన్ భాష నేర్పించే కోర్సు లేదని... వారిని అక్కడికి మరో ఆలోచనతో టామ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అనుమానం వస్తోందని పోలీసులు తెలిపారు. అంతేకాదు టామ్ అర్మేనియా నుంచి రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేస్తానని యువతులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు వ్యభిచారం కూపంలోకి దింపేందుకే టామ్ వ్యూహం రచించాడని ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో టామ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే టామ్‌కు ఇంతకుముందు ఏదైనా నేరచరిత ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications