వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kerala Rain Update: ప్రభావిత జిల్లాలకు అలర్ట్ : ముంపు ప్రాంతాల వాసుల తరలింపు...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులుగా వరదలతో సతమతమవుతున్న కేరళలో రానున్న రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో 6-20 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చని అంచనా వేసింది. వరదలతో ఇడుక్కి, పంబా, కక్కీతో పాటు మరో 78 జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రధానంగా కొండ చరియలు విరిగే పడే ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

ఇడుక్కి...కొట్టాయం జిల్లాల్లో ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది తొలిసారిగా పేర్కొంటున్నారు. వరదలతో ఇడుక్కి, పంబా, కక్కీతో పాటు మరో 78 జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం స్తంభించిపోతోంది. వీడని జడివాన కారణంగా శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె.రాజన్‌ తెలిపారు.

Rain-battered Kerala is set to receive more rain starting , IMD has predicted

భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం కల్పించే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. రాష్ట్రంలో నిండుకుండల్లా మారిన 10 డ్యామ్‌లకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కక్కీ డ్యామ్‌లో రెండు గేట్లు తెరిచి, నీటికి కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో అయ్యప్ప భక్తులు స్నానమాచరించే పంపా నదిలో నీటి మట్టం 15 సెంటీమీటర్లు పెరగనుంది. కేరళలో ఈ నెల 20 నుంచి అక్టోబర్‌ 24న వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి తులా మాసం పూజల కోసం భక్తులను అనుమతించట్లేదని మంత్రి రాజన్‌ పేర్కొన్నారు.

పంపా నదిలో నీటి మట్టం పెరుగుతున్నందునయాత్రను నిలిపివేశామన్నారు. దక్షిణ కేరళలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఇప్పటిదాకా వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 38 మరణించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాలు, వరద నష్టం తదితర అంశాలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.

దేశ రాజధానిలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 87.9 మిల్టీవీుటర్ల వర్షం కురిసింది. 1910 అక్టోబర్‌లో నగరంలో ఒక్కరోజే 152.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ నెల 18న(సోమవారం) కూడా భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది.

English summary
Rain-battered Kerala is set to receive more rain starting Wednesday, IMD has predicted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X