Keralaలో కరోనా: ఇంకా ఉధృతి -15.5శాతానికి పాజిటివిటీ రేటు -కొత్తగా 21,427 కేసులు, 179 మరణాలు

దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా విలయ పరిస్థితి ఇంకాస్త ముదిరింది. దేశంలోనే అతి ప్రమాదకర హాట్ స్పాట్ గా కొనసాగుతోన్న రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు అనూహ్యంగా పెరుగూత 15.5 శాతానికి పెరిగింది. గత నెల రోజులుగా కొత్త కేసులు 20 వేలకుపైగా వస్తుండటం, మరణాలు పెరగడం కలకలం రేపుతున్నది.

కేరళ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,427 కరోనా కేసులు, 179 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,45,457కు, మొత్తం మరణాల సంఖ్య 19,049కు పెరిగింది.

Kerala reports 21,427 new Covid-19 cases, 179 deaths in last 24 hrs TPR at 15.5 pc

మరోవైపు గత 24 గంటల్లో 18,731 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 35,48,196కు చేరుకున్నదని పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో టెస్ట్‌ పాజిటివిటీ రేటు 15.5 శాతంగా ఉన్నది.

కరోనాకు వ్యతిరేకంగా రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మరోసారి వ్యాక్సిన్‌ వేయలేమని కేంద్రం కేరళ హైకోర్టుకు తెలిపింది. కేరళలోని కన్నూరుకు చెందిన ఓ వ్యక్తి కొవాగ్జిన్‌ రెండో మోతాదులు తీసుకున్నాడు. ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లాల్సి ఉండగా.. ఆ దేశం టీకాను ఆమోదించకపోవడంతో తనకు మరోసారి కొవిషీల్డ్‌ టీకా వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశాడు.

అయితే, 'రెండు కంటే ఎక్కువ టీకాలు పొందిన వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక వ్యక్తికి రెండు డోసుల కంటే ఎక్కువ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఎలాంటి నిబంధన లేదు. మూడో డోస్‌ వేసేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అధిక డోస్‌ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ విషయంలో ఎలాంటి అధ్యయనాలు జరుగలేదు. ఈ కేసులో పిటిషనర్‌ వాదనను పరిగణలోకి తీసుకోలేం. ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటే మరింత మంది కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది' అని కేంద్రం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+