కేరళలో కరోనా వైరస్ విలయం: 50వేలకు తగ్గేదెలే అంటున్న కేసులు, తాజాగా 51వేలపైనే
తిరువనంతపురం: దేశంలో మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టగా.. ఒక్క కేరళలో మాత్రం ఆ మహమ్మారి విలయం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 51,570 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటి 50,812తో పోల్చుకుంటే కాస్త కేసుల్లో పెరుగుదల నమోదైంది.
కేరళ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేరళలో గత 24 గంటల్లో 461 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 53,666కు చేరింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 3,54,595 కరోనా వైరస్ యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ మోదవుతున్న కేసుల్లో హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, ఇక్కడ 3674 కరోనా కేసులు నమోదు కాగా, 30 మంది కరోనాతో చనిపోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. తాజాగా, 1160 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 2530 మంది కరోనా నుంచి కోలుకోగా, 10,797 యాక్టివ్ కేసులున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. ఆదివారం 28,264 మందికి కరోనా సోకినట్లు తేలింది. శనివారంనాటి 33,337తో పోలిస్తే దాదాపు 5వేల కేసులు తగ్గాయి. 68 మంది మరణించారు. ఒక్క బెంగళూరులోనే 11,938 మంది కరోనా బారినపడగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కార్ణాటక రాష్ట్రంలో 2,51,084 యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో 2,34,281 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. అయితే, అదే సమయంలో మరణాల సంఖ్య పెరగటం కొంత ఆందోళనకు కారణమవుతోంది. వైరస్‌తో మరో 893 మంది మరణించారు. 3,52,784 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Recommended Video
ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522గా రికార్డు అయింది. అదే విధంగా మొత్తం మరణాలు 4,94,091 గా నిర్దారించారు. ఇక, ప్రస్తుతం 18,84,937 యాక్టివ్ కేసులు ఉండగా... 3,87,13,494 మంది కరోనా నుంచి కోలుకున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా సాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది. అధిక స్థాయిలో కేసులుల నమోదవుతూ ఆందోళన చెందిన రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుతున్నాయి. కేరళలో శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం మరో 50,812 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 8 మంది వైరస్‌కు బలయ్యారు. దేశంలోని 75 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించింది.












Click it and Unblock the Notifications