వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

75 మందే.. ఫంక్షన్లకు పర్మిషన్... ఎక్కువ అయితే తప్పని ఫైన్.. కేరళలో ఇలా

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. దీంతో జనాలు భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఆంక్షల బాట పడుతున్నాయి. సంక్రాంతి ముందు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. తొలుత రాత్రి పూట కర్ఫ్యూ.. వీకెండ్స్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కేరళ కూడా అప్రమత్తం అయ్యింది. జనం గుంపులుగా గుమికూడి ఉండొద్దని స్పస్టంచేసింది.

కేసులు పెరుగుతున్నందున పబ్లిక్, ప్రైవవే్ ప్లేసుల్లో జనం గుంపులు గుంపులుగా ఉండొద్దని ప్రభుత్వం స్పస్టంచేసింది. పెళ్లి, అంత్యక్రియలు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు 75 మందిని మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇండొర్ ఫంక్షన్లకు 75 మంది పరిమితి విధించారు. అవుట్ డోర్ అయితే 150 మందిని అలో చేశారు.

సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఎయిర్ పోర్టు వద్ద మరింత పకడ్బందీగా పరీక్షలు చేయాలని సమావేశంలో ప్రతిపాదన వచ్చింది. కరోనా ఉంటే వెంటనే క్వారంటైన్‌కు పంపించాలని స్పష్టంచేసింది. అలాగే కరోనా సోకి చనిపోయిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే ఆప్లికేన్ చేసిన వారిని వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని సీఎం స్పస్టంచేశారు.

కేరళలో 181 ఒమిక్రాన్ యాక్టివ్ కేసలు ఉన్నాయి. వైరస్ ఎవరినీ వదలడం లేదు.80 శాతం యువత రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. 15.43 శాతం మంది యువత వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. వీరిలో 2 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

 kerala restricts number of people attending events as omicron cases

గత ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఈ నెల ఆఖరు వరకు కర్ఫ్యూ.. లేదంటే స్వల్పంగా లాక్ డౌన్ విధించే సిచుయేషన్ అయితే ఉంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. రోజు రోజుకు అయితే కేసులు మాత్రం పెరగడం కాస్తం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.

English summary
indoor functions 75 people are allowed kerala government said in the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X