Kerala: చిన్న పిల్లలకూ వ్యాక్సిన్ -కేంద్రం అనుమతిస్తే రెడీ -కరోనా టెస్టుల పెంపు: వీణా జార్జ్
దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు దగ్గర్నుంచి, ఇప్పటికీ కొత్త కేసులు, మరణాల్లో ముందున్న కేరళలో మహమ్మారిని అదుపు చేసే దిశగా పినరయి విజయన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా చిన్న పిల్లలకూ కొవిడ్ టీకాలు అందించాలని కేరళ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకుగానూ కేంద్రం నుంచి అనుమతి కోరినట్లు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
Recommended Video
తిరువనంతపురంలో గురువారం నాడు ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి వీణా జార్జ్ మీడియాతో మాట్లాడారు. కేరళలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రతి కేసునూ గుర్తించేందుకు పెద్ద ఎత్తున టెస్టింగ్స్ సంఖ్యను పెంచామన్నారు. అలాగే, 12 నుంచి 18 ఏళ్ల వయసున్నవారికీ టీకాలు అందించాలనుకుంటున్నామని, కేంద్రం అనుమతిస్తే సెప్టెంబర్ నుంచే ఆ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.

కేరళలో వైరస్ కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల పెరుగుదలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సైతం దృష్టి సారించారని, యాక్టివ్ కేసులు పేరుకుపోతుండటంతో వైరస్ నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు కేరళకు కేంద్రం రూ 267.35 కోట్లు సమకూర్చిందని మంత్రి వీణ తెలిపారు. అదే సమావేశంలో..
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన భేటీలోనే.. సెప్టెంబర్ మాసాంతానికి కేరళకు 1.1 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని కోరగా అందుకు అంగీకరించారని ఆమె తెలిపారు. చిన్న పిల్లకు టీకాలపై తాజాగా కేంద్రానికి అభ్యర్థన పంపామని, ఆమోదం లభిస్తే సెప్టెంబర్ లోనే ఆ పనిని ప్రారంబిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి భారత్ బయోటెక్ పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాక్సిన్‌కు సెప్టెంబర్ లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. ఇది కూడా పిల్లల వ్యాక్సినేషన్‌కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా,
కోవిడ్-19 టీకా రెండో డోస్ తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా 87 వేల మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం కేసుల్లో 46 శాతం ఒక్క కేరళలోనే నమోదయినట్టు పేర్కొన్నాయి. 'కేరళలో తొలి డోస్ తీసుకున్న తర్వాత దాదాపు 80 వేల మందికి వైరస్ సోకింది.. రెండో డోస్ వేసుకున్నవారిలో 40 వేల మందికి కోవిడ్ నిర్దారణ అయ్యింది' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో రెండో దశ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. కొత్త వేరియంట్‌లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక, కేరళలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన వాయనాడ్ జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం కలవరానికి గురిచేస్తోంది. కేరళలో గురువారం 21,427 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. 179 మంది మృతిచెందారు. దీంతో కేరళ పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడులో పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది.
-
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!!












Click it and Unblock the Notifications