"నువ్ చూడ్డానికి అమ్మాయిలా లేవు.. జీరో టికెట్ ఇవ్వను" యువతికి షాకిచ్చిన కండక్టర్
దేశవ్యాప్తంగా మహిళల సాధికారత, మహిళల అభివృద్ధితోపాటు వారికి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. తెలంగాణ లో మహాలక్ష్మి పథకంగా, కర్ణాటకలో శక్తి స్కీమ్ అని, తమిళనాడులో మగలిర్ విడియల్ పయనం అని, దిల్లీలో పింక్ టికెట్ అని, పంజాబ్ లో ఉచిత బస్సు పథకంగా, పశ్చిమ్ బెంగాల్ లో అన్నపూర్ణ యోజన లింక్డ్ స్కీమ్ గా.. కేరళలో ప్రియదర్శి KSRTC ఫ్రీ ట్రావెల్ గా ఇక జమ్మూ కాశ్మీర్ లో ఫ్రీ ఉమెన్స్ ట్రావెల్ స్కీమ్ గా అమలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లోని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అయితే కేరళలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయికి బస్సు కండక్టర్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో విస్మయం చెందిన ఆ యువతి కండక్టర్ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కేరళలో ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని అనే పేరుతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే గురువాయూర్ నుంచి ఎర్నాకుళం వెళ్లే ఓ బస్సులో ప్రయాణిస్తున్న యువతిపై కండస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె చూడ్డానికి అమ్మాయిలా లేవు.. జీరో టికెట్ ఇవ్వను అని చెప్పడంతో ఆ యువతి షాక్ అయింది. ఈ మేరకు పరవూర్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. కండక్టర్ బస్సులో తనను అవమానించాడని.. తోటి ప్రయాణికులతో ఈమె అమ్మాయిలా ఉందా..? లేదా..? అని అడుగుతూ తన పరువుకు భంగం కలిగించాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

బస్సులోని ప్రయాణికులంతా తనను వింతగా చూశారని.. ఈ ఘటనతో తాను ఎమోషనల్ గా అప్సెట్ అయ్యానని అన్నారు. కండక్టర్ పై యాక్షన్ తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో యువతి కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కండక్టర్ స్టేషన్ కు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications
