బాలికపై పూజారి దారుణం: అసహజ శృంగారం, వేధింపులకు బలి..

రెంజు బాలికపై లైంగిక దాడి చేయడమే గాక అసహజ శృంగారానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్: అక్రమ సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్న ఘటనలు ఈమధ్య కాలంలో తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లోని ఓ యువతి పెళ్లికి ముందే గర్భం దాల్చి పసికందును బకెట్ నీళ్లలో ముంచి చంపేసిన ఘటన మరవకముందే కేరళలో ఓ బాలిక.. తల్లి ఆమె ప్రియుడు పెట్టిన లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. కులక్షేత్రపురం పరిధిలోని కరుణగప్పల్లి గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మార్చి 28రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తల్లికి ఉన్న అక్రమ సంబంధమే ఈ ఆత్మహత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Kerala: Temple priest held for rape of girl, suicide

బాలిక తండ్రి ఆర్మీలో పనిచేస్తున్నట్లు తెలిపిన పోలీసులు.. ఆమె తల్లికి కొంతకాలంగా రెంజు(29) అనే పూజారితో అక్రమ సంబంధం ఉన్నట్లు చెప్పారు. రెంజు బాలికపై లైంగిక దాడి చేయడమే గాక అసహజ శృంగారానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ వేధింపులు తాళలేకనే ఏడో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి మరియు ఆమె ప్రయుడిపై పోస్కో చట్టం కింద అత్యాచార కేసు నమోదు చేశారు. తల్లితో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి బాలిక తన గదిలో చదువుకుంటూ తలుపు లాక్ చేసింది. మరుసటి రోజు ఉదయం వరకు తలుపు మూసే ఉండటంతో అనుమానం వచ్చిన తల్లి.. స్థానికుల సహాయంతో తలుపును బద్దలుకొట్టింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే బాలిక కిటికీ గ్రిల్ కు ఉరేసుకుని కనిపించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+