అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్థాన్ సంబంధాల ఆరోపణలు: కుమార్ విశ్వాస్‌కు ‘వై’ కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్‌కు 'వై' కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్నారని కుమార్ విశ్వాస్ ఆరోపించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా కుమార్ విశ్వాస్ భద్రత, ముప్పు అవగాహనను కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. సమీక్ష తర్వాత, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ద్వారా విశ్వాస్ 'వై' కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి తెలిపాయి.

'వై' కేటగిరీ భద్రత కింద 24 గంటలపాటు కుమార్ విశ్వాస్‌కు నలుగురు వ్యక్తిగత భద్రతా అధికారులు రక్షణ కల్పిస్తారు. కుమార్ విశ్వాస్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీల నేతలు అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం కోసం వేర్పాటువాదులతో చేతులు కలుపుతారా? అంటూ మండిపడుతున్నారు.
ఖలిస్థాన్‌కు ప్రధాని అవుతానన్నారు: కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వేర్పాటువాద అంశాలకు పాల్పడ్డారని ఈ వారం ప్రారంభంలో విశ్వాస్ ఆరోపించిన వీడియో వైరల్ అయింది.
"ఒకరోజు, ఆయన (కేజ్రీవాల్) నాకు తాను (పంజాబ్) ముఖ్యమంత్రి అవుతానని లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్థాన్) మొదటి ప్రధాని అవుతానని చెప్పాడు.. అతను ఎలాగైనా అధికారం కోరుకుంటున్నాడు," అని విశ్వాస్ వీడియోలో చెప్పారు.
'టెర్రరిస్ట్' అని పిలిచే వ్యక్తి 12,430 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను నిర్మించాడు: అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్
పంజాబ్ వేర్పాటువాద ఆలోచనలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరులందరూ ఆప్‌కి వ్యతిరేకంగా జట్టుకట్టారని మరోసారి కౌంటర్ ఇచ్చారు.
దేశంలోని అవినీతిపరులంతా మనకు వ్యతిరేకంగా జట్టుకట్టారు, ఈరోజు ఢిల్లీలోని పాఠశాలల్లో 12,430 ఆధునిక తరగతి గదులను ప్రారంభించి వారికి తగిన సమాధానం ఇస్తాం. ఈ అవినీతిపరుల ముందు ఈ దేశం తలవంచదు. బాబా సాహెబ్, భగత్ సింగ్ కలలు నెరవేరుతాయి' అని ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో రాశారు.
Recommended Video
శనివారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 12,430 స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ప్రారంభోత్సవంలో ప్రసంగించిన అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ ప్రత్యర్థులను 'ఉగ్రవాది' అని పిలిచే వ్యక్తి దేశ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,430 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను నిర్మించాడని మండిపడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications