వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాయ్స్‌ని రెచ్చగొట్టేలా.. పెళ్లికాని గర్ల్స్ జీన్స్ ధరించొద్దు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Khap Panchayat bans jeans, mobiles for girls
లక్నో: వరుస అఘాయిత్యాల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామం యువతులను మొబైల్ ఫోన్లు వాడవద్దని, జీన్స్ ధరించవద్దని తీర్మానం చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో దారుణాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ముజఫర్ నగర్ జిల్లాలోని జాడ్వాడ్ గ్రామంలో వింత తీర్మానం చేశారు. మహిళల పైన దాడులకు సంబంధించి చర్చించేందుకు గ్రామపెద్దలు, స్థానిక గుజ్జర్ సమాజ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.

అఘాయిత్యాలను రూపుమాపే విషయమై వారు చర్చించారు. ఇందులో భాగంగా.. పెళ్లి కాని యువతులు జీన్స్ ధరించరాదని, మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామంలో ప్రకటన చేశారు. మద్యం అమ్మకాల పైనా నిషేధం విధించారు.

తమ సంప్రదాయానికి జీన్స్ విరుద్దమని గుజ్జర్ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అయితే, వివాహం అయిన స్త్రీలు మొబైల్ వాడవచ్చునని తెలిపారు. ఈ తీర్మానాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి కట్టుబాట్లతో మహిళల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందంటున్నారు.

యువతులు జీన్స్ ధరించడం సరికాదని, యువకులు వాటి వల్ల దారుణాలకు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై గ్రామానికి చెందిన ఓ యువతి మాట్లాడుతూ.. జీన్స్ ధరించవద్దని, మొబైల్ ఫోన్లు వాడవద్దని తీర్మానం చేయడం సబబే అని పేర్కొంది. మనకు మనం కొంత కంట్రోల్లో ఉండాలని ఆమె అభిప్రాయపడింది.

ఈ తీర్మానం పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ మండిపడ్డారు. మహిళల పట్ల ఎవరికీ వివక్ష తగదన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు ఈ దేశంలో సమానత ఉందన్నారు. వారి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరించవచ్చునని తెలిపారు. ఎవరైనా ఇలాంటి తీర్మానాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

English summary
In yet another bizzare dikat of the Khap Panchayat in Uttar Pradesh's Muzzafarnagar district, it has banned unmarried girls from wearing jeans and using mobile phones. The panchayat claimed that these have a bad influence and were responsible for girls being harassed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X