వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమః శివాయ : ముస్లీం యువకుడి గానం... శివనామస్మరణతో మారుమోగిన స్టూడియో

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : మనస్సులో భక్తి. కనిపించని దేవుడి ఎదలో అచంచలమైన నమ్మకం. అంతలో గొంతు సవరించుకొని .. ఓం మహప్రాణ దీపం అని ఓ గొంతు ఎలుగెత్తింది. అంతే ఆ పాట పడింది ఆ అబ్బాయి లేదంటే నిజంగా పాడిన శంకర్ మహదేవన్ అనే ఆశ్చర్యం కలిగింది. స్టూడియోలో ప్రోగ్రామ్ చూసిన వారు మనసు పులకించిపోగా .. తర్వాత టెలివిజన్‌లో చూసిన వారు కూడా అంతే ఆనంద పడ్డారు. అతని మధురమైన గొంతు నుంచి ఆ మహాశివుడి పాటను విని తన్మయించిపోయారు. ఆ యువ గాయకుడిని మనసారా అభినందించారు.

పాటల పూదోటలో

పాటల పూదోటలో

ప్రాంతీయ భాషలో పాటల పోటీలు సహజమే. అలాగే కర్ణాటకలో కూడా కన్నడ కోగిల (కన్నడ కోకిల) సీజన్ 2 నిర్వహించారు. ఈ సీజన్‌లో ఓ యువ నేపథ్య గాయకుడి ప్రతిభ బయటపడింది. ఖాసీం అలీ.. పేరు ముస్లిం అయినా .. సంగీతం తెలుసు. అచ్చం హిందువులాగే ఉంటాడు. పాటలు కూడా అసలు పాడిన వారిని కూడా తలపిస్తారు. ఇటీవల జరిగిన కన్నడ కోకిల్ సీజన్ 2 టైటిల్ గెలుచుకున్నాడు. అతని పాడిన పాట ఏంటో తెలుసా .. తెలుగులో మంజునాథ సినిమాలోని మహ ప్రాణ దీపం పాడి ... ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య .. జడ్జీల మనస్సులను గెలుచుకొని .. టైటిల్ సొంతం చేసుకున్నాడు.

సెల్యూట్ .. ఖాసీం..

సెల్యూట్ .. ఖాసీం..


ఈ పాటలో ఆసాంతం లీనమైపోయి పాడాడు ఖాసీం అలీ. అతని పాటను అక్కడున్న జడ్జీలు స్వయంగా విని పులకించిపోయారు. వెంటనే అతన్ని సీజన్ 2 విజేతగా ప్రకటించి .. తాము నిజమైన జడ్జీలమని నిరూపించుకున్నారు. ప్రేక్షకులు సైతం రెప్పవాల్చకుండా చూసి .. చెవితో జాగ్రత్తగా విని ఆనంద పడిపోయారు. అతను పాట పడినంత సేపు అతని తల్లిదండ్రులు కూడా ఉద్వేగానికి గురయ్యారు. ఓ గొప్ప పాట పాడిన ఖాసీంను అందరూ అభినందిస్తున్నారు. అతను పేరుకే ముస్లిం కానీ .. సంగీతానికి కాదని నిరూపించారు. అతని ప్రతిభా పాటవాలను చిన్న, పెద్ద అని లేకుండా అందరూ కొనియాడుతున్నారు. శెభాష్ ఖాశీం అంటూ అభినందిస్తున్నారు.

కన్నడ కోకిలే

కన్నడ కోకిలే

కన్నడ కోకిల కార్యక్రమానికి జడ్జీలుగా సాధుకోకిల, చందన్ శెట్టి, అర్చన వ్యవహరించారు. ఖాశీం పాట పాడుతున్నంత సేపు వారు అమితాశ్చర్యానికి గురయ్యారు. ఖాశీంను అభినందించి .. ఆశీర్వదించారు. కన్నడ కోకిల లక్ష్యం యువ నేపథ్య గాయకులను వెలికితీయడం. సీజన్ 2తో తమకు మరో మంచి ఆణిముత్యం లభించిందని కన్నడ ఇండస్ట్రీ భావిస్తోంది. ఈ పాట విన్న ప్రతీ ఒక్కర ఖాసీంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సెల్యూట్ ఖాశీం అంటూ మనసారా విష్ చేస్తున్నారు. అద్భుత ప్రతిభ, మంచి గొంతు, టైమింగ్ ఉన్న ఖాశీంకు మంచి భవిష్యత్ ఉండాలని వన్ ఇండియా నెట్ వర్క్ కూడా కోరుకుంటుంది. ఆల్ ద బెస్ట్ ఖాశీం ఇన్ ఫ్యూచర్.

English summary
Khasim Ali has emerged as the winner of the singing show Kannada Kogile season 2 which came to an end this week. The show judged by Sadhukokila, Chandan Shetty and Archana Udupa is hosted by Siri. Khasim Ali won the hearts of the viewers by singing the devotional song Mahaprana Deepam from the movie Shree Manjuantha. Neethu Subramanyam and Partha were declared as the runner ups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X