Khiladi: ఆఫీసుకు వెలుతున్న భార్య ? నడిరోడ్డులో ఆటో నిలిపి రివాల్వర్ తో భర్త కామిడి, అసలు మ్యాటర్ !
పంచకుల/హర్యానా: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం సంతోషంగా జీవించాడు. దంపతులు ఇద్దరూ ప్రత్యేకంగా నివాసం ఉంటున్నారు. భార్య మంచి ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజూ భార్య ఆఫీసుకు వెళ్లి వస్తోంది. రోజూ బయటకు వెలుతున్న భార్య మీద ఆమె భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరగడంతో ఇద్దరూ విడిపోయారు. పుట్టింటిలో నివాసం ఉంటున్న భార్య ఉద్యోగం చేస్తోంది. భర్తకు భయపడిన భార్య రోజూ ఆటోలో ఆఫీసుకు వెళ్లి వస్తోంది. ఆఫీసు నుంచి ఆటోలో ఇంటికి వెలుతున్న భార్యను అడ్డగించిన భర్త ఆమెను నడిరోడ్డులో పట్టుకుని చితకబాదేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏమి చేస్తున్నావు అంటూ భర్త రెచ్చిపోయాడు. ఇదే సమయంలో జోబులో నుంచి రివాల్వర్ బయటకు తీసిన భర్త అతని భార్య తల మీద గురి పెట్టి కాల్చేస్తా అంటూ రెచ్చిపోయి నానా హంగామా చేశాడు. స్థానికులు భర్తను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. భర్త కిలాడీ స్కెచ్ తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

దంపతుల హ్యాపీలైఫ్
హర్యానాలోని పంచకులోని సెక్టార్ 19లో శంషేర్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పంచకులో నివాసం ఉంటున్న శీతల్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకోవాలని కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు శంషేర్ సింగ్ కు చెప్పారు. కుటుంబ సభ్యులు చూపించిన శీతల్ ను వివాహం చేసుకున్న శంషేర్ సింగ్ భార్యతో కొంతకాలం సంతోషంగా జీవించాడు.

ఉద్యోగం చేస్తున్న భార్య మీద అనుమానం
శంషేర్ సింగ్, శీతల్ దంపతులు ఇద్దరూ పంచకులలో ప్రత్యేకంగా నివాసం ఉంటున్నారు. శంషేర్ సింగ్ భార్య శీతల్ పంచకులో మంచి ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజూ భార్య శీతల్ ఆఫీసుకు వెళ్లి వస్తోంది. రోజూ బయటకు వెలుతున్న భార్య శీతల్ మీద ఆమె భర్త శంషేర్ సింగ్ కు అనుమానం పెరిగిపోయింది. భార్య శీతల్ బయటకు వెళ్లిన తరువాత శంషేర్ సింగ్ ఆమె మీద నిఘా వెయ్యడం మొదలుపెట్టాడు.

భర్త తీరుతో విసిగిపోయిన భార్య
రోజూ భార్య శీతల్ బయటకు వెళ్లిన తరువాత ఆమెకు తెలీకుండా ఆమెను ఫాలో అవుతున్న శంషేర్ సింగ్ ఆమెను ఎవరెవరిని కలుస్తోంది ? అంటూ ఆరా తీశాడు. కొంతకాలం క్రితం తన భర్త శంషేర్ సింగ్ తనను ఫాలో అవుతున్నాడని గుర్తించింది. ఇదే విషయంలో శీతల్, శంషేర్ సింగ్ దంపతుల మద్య గొడవలు జరగడంతో ఇద్దరూ విడిపోయారు.

పుట్టింటిలో భార్య...... భర్తకు భయపడి ?
పుట్టింటిలో నివాసం ఉంటున్న శీతల్ ముందులాగానే ఉద్యోగం చేస్తోంది. భర్త శంషేర్ సింగ్ కు భయపడిన అతని భార్య శీతల్ రోజూ ఉదయం, సాయంత్రం ఆటోలో ఆఫీసుకు వెళ్లి వస్తోంది. భార్య శీతల్ దూరం అయినా ఆమె భర్త శంషేర్ సింగ్ మాత్రం ఆమె మీద నిఘా వెయ్యడం మానుకోలేదు. ప్రతినిత్యం భార్య శీతల్ ను అతను ఫాలో అవుతూనే ఉన్నాడు.

నడిరోడ్డులో రచ్చరచ్చ చేసిన భర్త
సాయంత్రం ఆఫీసు నుంచి ఆటోలో ఇంటికి వెలుతున్న భార్య శీతల్ ను సెక్టార్ 12లో అడ్డగించాడు. ఆటోను బైక్ తో డీకొట్టిన శంషేర్ సింగ్ ఆటో డ్రైవర్ సంజయ్ కుమార్ తో గొడవ పెట్టుకున్నాడు. తరువాత శంషేర్ సింగ్ నడిరోడ్డులో భార్య శీతల్ ను పట్టుకుని చితకబాదేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏమి చేస్తున్నావు అంటూ శీతల్ మీద ఆమె భర్త శంషేర్ సింగ్ రెచ్చిపోయాడు.

బొమ్మ తుపాకితో కాల్చేస్తానని ?
ఇదే సమయంలో జోబులో నుంచి రివాల్వర్ బయటకు తీసిన శంషేర్ సింగ్ అతని భార్య శీతల్ తల మీద గురి పెట్టి కాల్చేస్తా అంటూ రెచ్చిపోయి నానా హంగామా చేశాడు. స్థానికులు శంషేర్ సింగ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు శంషేర్ సింగ్ దగ్గర ఉన్న రివాల్వర్ స్వాధీనం చేసుకుని అతని కిలాడీ స్కెచ్ తెలుసుకుని షాక్ అయ్యారు. శంషేర్ సింగ్ దగ్గర ఉన్నది బొమ్మ రివాల్వర్ అని పోలీసులు అన్నారు.

భార్యను లొంగదీసుకోవాలని
శీతల్, ఆటో డ్రైవర్ సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు శంషేర్ సింగ్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పంచకుల సెక్టార్ 12 పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద బొమ్మ తుపాకితో భార్యను బెదిరించడానికి ప్రయత్నించిన శంషేర్ సింగ్ ఇప్పుడు కటకటాలపాలైనాడు.












Click it and Unblock the Notifications