Khiladi wife: మొదటి భర్త కొడుకుతో భర్తను చంపించిన రెండో భార్య, కిలాడీ పెళ్లామ్ స్కెచ్ తో ?, మ్యాటర్ !
భోపాల్/మధ్యప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకున్న అతను భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. అనారోగ్యంతో అతని భార్య చనిపోయింది. భార్య చనిపోవడంతో అతను ఒంటరిగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకుని కొడుక్కి తల్లి అయిన మహిళ భర్తకు దూరంగా ఉండేది. భార్య చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగికి, భర్తను వదిలేసిన మహిళకు పరిచయం అయ్యింది. కొంతకాలం సహజీవనం చేసిన ఇద్దరూ తరువాత పెళ్లి చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న మహిళ అతనితో సంతోషంగా కాపురం చేస్తున్నట్లు నటించింది. ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెలుతున్న భర్త నడిరోడ్డులో దారుణ హత్యకు గురైనాడు. ప్రభుత్వ ఉద్యోగి హత్య కేసులో అతని రెండో భార్య, ఆమె మొదటి భర్త కొడుకు అరెస్టు కావడం కలకలం రేపింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని హత్య చెయ్యడానికి అతని రెండో భార్య ఆమె కొడుకుతో కలిసి పవర్ ఫుల్ స్కెచ్ వేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని చోళ ప్రాంతంలో అమర్ సింగ్ విశ్వకర్మ అలియాస్ అమర్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, భోపాల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమర్ సింగ్ కారు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమర్ సింగ్ కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

భార్య చనిపోయింది
పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకున్న అమర్ సింగ్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. అనారోగ్యంతో అమర్ సింగ్ భార్య నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయింది. భార్య చనిపోవడంతో అమర్ సింగ్ ఒంటరిగా ఉండేవాడు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావని, నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఒత్తిడి చేశారు.

భర్తను వదిలేసిన మహిళతో ?
భోపాల్ లోనే శాంతి అనే మహిళ నివాసం ఉంటున్నది. పెళ్లి చేసుకుని కొడుక్కి తల్లి అయిన శాంతి ఆమె భర్తకు దూరంగా ఉండేది. భర్తను వదిలేసిన శాంతికి అమర్ సింగ్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం సహజీవనం చేసిన అమర్ సింగ్, శాంతి తరువాత పెళ్లి చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమర్ సింగ్ ను ఏడాది క్రితం రెండో పెళ్లి చేసుకున్న శాంతి అతనితో సంతోషంగా కాపురం చేస్తున్నట్లు నటించింది.

భర్త హత్యకు స్కెచ్ వేసిన రెండో భార్య
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమర్ సింగ్ కు అతని తల్లిదండ్రులు సంపాధించిన ఆస్తులు చాలానే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమర్ సింగ్ అతను సొంతంగా కొన్ని ఆస్తులు సంపాధించాడు. తన భర్త అమర్ సింగ్ ఆస్తులు దక్కించుకుని వేరే వ్యక్తితో సంతోషంగా జీవించాలని అతని రెండో భార్య శాంతి స్కెచ్ వేసింది.

పక్కాప్లాన్ తో భర్తను చంపేసిన కిలాడి పెళ్లామ్
రాత్రి ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెలుతున్న అమర్ సింగ్ నడిరోడ్డులో దారుణ హత్యకు గురైనాడు. ప్రభుత్వ ఉద్యోగి అమర్ సింగ్ హత్య కేసులో అతని రెండో భార్య శాంతి, ఆమె మొదటి భర్త కొడుకు అరెస్టు కావడం కలకలం రేపింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని హత్య చెయ్యడానికి అతని రెండో భార్య శాంతి ఆమె కొడుకుతో కలిసి పవర్ ఫుల్ స్కెచ్ వేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

రాత్రి ఏం జరిగిందంటే ?
అమర్ సింగ్ తో పాటు అతని రెండో భార్య శాంతి ఆసుపత్రి నుంచి బైక్ లో బయలుదేరాడు. మార్గం మధ్యలో బైక్ నిలపాలని శాంతి ఆమె భర్త అమర్ సింగ్ కు చెప్పింది. అమర్ సింగ్ బైక్ నిలిపిన తరువాత అక్కడే దాక్కొన్న శాంతి మొదటి భర్త కొడకు కొడవలితో అతని మీద దాడి చేశాడు. అదే సమయంలో శాంతి కూడా బండరాయి తీసుకుని అమర్ సింగ్ మీద దాడి చేసి చంపేశారు.

అడ్డంగా బుక్కైపోయిన భార్య
అమర్ సింగ్ శవాన్ని రోడ్డు పక్కన విసిరేసి ఇంటికి వెళ్లిపోయిన శాంతి ఉద్యోగానికి వెళ్లిన తన భర్త తిరిగిరాలేదని అందరిని నమ్మించింది. తన భర్త అమర్ సింగ్ ను ఆస్తి కోసం మేమే చంపేశామని శాంతి అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు. ఆస్తి కోసం భర్త అమర్ సింగ్ ను హత్య చేసిన శాంతితో పాటు ఆమె మొదటి భర్త కొడుకుని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications